తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు. అందులో కొంతమంది మాత్రమే వారి సినిమాలతో సక్సెస్ సాధిస్తారు. మరికొంతమంది ఎన్ని సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు అందుకోలేక పోతారు. తెలుగు సినీ పరిశ్రమలో ఉప్పెన సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన చిన్నది కృతి శెట్టి. ఈ భామ గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకున్న కృతి శెట్టి ఆ సినిమా అనంతరం వరుసగా సినిమాలలో అవకాశాలను అందుకుంది. బ్యాక్ టు బ్యాక్ తెలుగు సినిమాలలో నటించి ప్రేక్షకుల మనసులను దోచుకుంది. 

అతి తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్ గా కృతి శెట్టి నిలిచింది. కానీ తాను నటించిన సినిమాలన్నీ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. హీరోయిన్ గా సక్సెస్ అయినప్పటికీ తన సినిమాల ద్వారా అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. వరుసగా డిజాస్టర్లు ఎదురవడంతో ఈ బ్యూటీకి ప్రస్తుతం సినిమా అవకాశాలు ఇవ్వడానికి ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. ఈ భామ ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా గడుపుతోంది. తమిళంలో బ్యాక్ బ్యాక్ సినిమాలు చేసుకుంటూ పోతోంది. తెలుగులో ఏవో కొన్ని సినిమాలలో మాత్రమే నటిస్తోంది. తాజాగా కృతి శెట్టికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో సంచలనాలు రేపుతోంది.

బ్యూటీ జిమ్ కి వెళ్లి వస్తుండగా కొంతమంది ఫోటోగ్రాఫర్లు కృతి శెట్టిని ఫోటోలు, వీడియోలు తీశారు. ఆ తర్వాత కృతి శెట్టి కారులో వెళుతుందని అంత అనుకున్నారు కానీ కృతి శెట్టి ఆటోలో ఎక్కడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇంతవరకు ఏ హీరోయిన్ కూడా ఇలా ఆటోలో ఇంటికి వెళ్లడం చూడలేదని సెక్యూరిటీ లేకుండా బయటికి రావడం ఇదే మొదటిసారి అని కామెంట్లు చేస్తున్నారు. సినిమాలలో అవకాశాలు రాకపోవడంతో ఈ భామ తన ఆస్తులను కోల్పోయిందని కామెంట్లు చేస్తున్నారు. సినిమాలలో అవకాశాల కోసం కృతి శెట్టి ఈ మధ్య గ్లామర్ డోస్ కూడా పెంచేసింది. తన అందాలను ఆరబోస్తూ ఫోటోషూట్లు చేస్తోంది. దీనిపైన కృతి శెట్టి ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: