మంచు కుటుంబం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మంచు మోహన్ బాబు చిత్ర పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి తన కుమారులను కూడా హీరోలుగా సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. మంచు విష్ణు, మనోజ్ వారి సినిమాలతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. గత కొద్దిరోజుల నుంచి మంచు కుటుంబంలో అనేక రకాల గొడవలు, విభేదాలు కొనసాగుతున్నాయి. మంచు మనోజ్ పై విష్ణు, మోహన్ బాబు అనేక రకాల కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని మనోజ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 

ఒకానొక సమయంలో మంచు కుటుంబంలో జరిగిన గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. పోలీస్ స్టేషన్ లో ఒకరిపై ఒకరు కేసులు వేసుకోవడం, ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడం లాంటివి చేశారు. అంతేకాకుండా మంచు కుటుంబంలో జరిగిన ఫంక్షన్లకు దేనికి కూడా మనోజ్ ను ఆహ్వానించడం లేదు. వారికి వారే పార్టీలు, ఫంక్షన్లు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా.... మంచు మనోజ్ తాజాగా భైరవం సినిమాతో రీ లాంచ్ అవుతున్నారు. తాజాగా భైరవం సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమంలో మంచు మనోజ్ పాల్గొని ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. 

లాంచ్, రీలాంచ్ అని చాలా ప్లాన్ చేశాము. మనము ఒకటి తలిస్తే దేవుడు మరొకటి తలుస్తాడని మంచు మనోజ్ అన్నారు. శివుడిని శివయ్య అని పిలిస్తే రాడు మనసారా తలుచుకుంటేనే మా డైరెక్టర్ రూపంలోనూ, ప్రొడ్యూసర్ రూపంలోనూ శివయ్య వచ్చేవాడని మంచు మనోజ్ ఆసక్తికరమైన వాక్యాలు చేశారు. మనోజ్ చేసిన ఈ వ్యాఖ్యలకు స్టేజ్ మీద ఉన్న వారంతా ఒక్కసారిగా నవ్వారు. ప్రస్తుతం మంచు మనోజ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇది తన అన్న విష్ణు డైలాగ్ ని వాడుకొని మనోజ్ ఇలా అన్నాడని కామెంట్లు చేస్తున్నారు. మంచు విష్ణు నటించిన తాజా చిత్రం కన్నప్ప. ఇందులో విష్ణు హీరోగా నటించారు. అంతేకాకుండా ప్రభాస్ కూడా కన్నప్ప సినిమాలో కీలకపాత్రను పోషించాడు. ఈ సినిమాలో మంచు విష్ణు శివయ్య శివయ్య అని పిలిచే సన్నివేశం ఒకటి ఉంటుంది. దానిని ఉద్దేశించే మంచు మనోజ్ ఇలా అన్నారని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: