టాలీవుడ్ ఇండస్ట్రీ అంటే అందరికీ ఎక్కువగా గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి నే. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పుడు మెగాస్టార్ గా మారి తన పేరు ని చెప్పుకొని పదిమంది ఇండస్ట్రీలోకి వచ్చేలా మారిపోయాడు చిరంజీవి.  ఈ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించడం అంటే మామూలు విషయం కాదు . అయితే ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీ పై దారుణాతి దారుణమైన ట్రోలింగ్ జరుగుతుంది . మెగా వారసుడి  పై చిరంజీవి చేసిన కామెంట్స్ ఆయన క్రేజ్ ని తగ్గించింది అని చెప్పుకోక తప్పదు . అయితే ఇలాంటి మూమెంట్లోనే మెగాస్టార్ చిరంజీవి ఒక డైరెక్టర్ కి ఇచ్చిన ఆఫర్ సోషల్ మీడియాలో అనేక విధాలుగా ఆయన పేరుని ట్రోలింగ్ కి గురి అయ్యేలా చేస్తుంది.


మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలో నటించిన విషయం అందరికీ తెలిసిందే.  ఈ సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది . అయితే ఈ సినిమా తర్వాత కళ్యాణ్ కృష్ణ కి ఆయన ఛాన్స్ ఇచ్చాడు అంటూ ఇండస్ట్రీలో టాక్ వినిపించింది . అయితే ఆ సినిమాను పక్కన పెట్టేసి చిరంజీవి - అనిల్ రావిపూడి సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చేశాడు. మరి కళ్యాణ్ కృష్ణ సంగతి ఏంటి..? చిరంజీవిని నమ్ముకుని ఉన్న ఈ డైరెక్టర్ వేరే హీరోతో కమిట్ కాలేకపోయాడు . అయితే ఇప్పుడు చిరంజీవి ఆ తప్పును సరిదిద్దుకోవడానికి చిరంజీవి కోసం రాసుకున్న కథను మెగామేనల్లుడితో ఫిక్స్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట.



మెగాస్టార్ చిరంజీవి - కళ్యాణ్ కృష్ణకు మెగా మేనల్లుడు తో మరో ప్రాజెక్ట్ సెట్ చేయించినట్లు టాక్ వినిపిస్తుంది . ఈ ప్రాజెక్టుని చిరంజీవి కోసం రాసుకున్నారట కళ్యాణ్ కృష్ణ . చిరంజీవి అంటే స్టోరీలు ఎలా రాసుకుంటారో డైరెక్టర్ లు అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు చిరంజీవి మెగా మేనల్లుడు ని లైన్ లోకి దింపడం అందరికీ కొత్త డౌట్లు పుట్టిస్తుంది . కళ్యాణ్ కృష్ణకు అసలు ఈ ప్రాజెక్ట్ ఇష్టం లేదట.  ఎక్కడ మెగాస్టార్ చిరంజీవి చెప్పిన మాట వినకపోతే ఇండస్ట్రీలో ఛాన్సులు ఇవ్వరో అన్న భయంతో అటు మింగలేక ఇటుకక్కలేని పొజిషన్లో ఉండిపోయారట .

కొంతమంది మాత్రం కళ్యాణ్ కృష్ణ ఈ ప్రాజెక్ట్ చేయకపోతేనే బెటర్ అని.. అసలు వైష్ణవ్ తేజకు పెద్ద బ్యాక్ గ్రౌండ్ లేదు అని.. వైష్ణవ్  తేజ తో సినిమా ను తెరకెక్కిస్తే ఉన్న ఇమేజ్ ఇంకా డ్యామేజ్ అవుతుంది అంటూ సజెస్ట్ చేస్తున్నారు . మరి కొంతమంది మాత్రం  మెగాస్టార్ ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు . మెగా ఫ్యామిలీ అంతా ఇంతే హీట్ అయ్యే సినిమాలను స్టార్స్ తీసుకుంటారు . హిట్ అవ్వని సినిమాలను చిన్న హీరోలకి విసిరేస్తారు .. మెగా ఫ్యామిలీ గుట్టూ ఇన్నాళ్లకు బయటపడింది అంటూ దారుణంగా చిరంజీవి క్యారెక్టర్ పై కామెంట్స్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: