ఇన్నాళ్లు సోషల్ మీడియాలో విక్టరీ వెంకటేష్ - త్రివిక్రమ్ కాంబోలో సినిమా రాబోతుంది రాబోతుంది అంటూ ఓ రేంజ్ లో మాట్లాడుకున్నారు . ఇదిగో అఫీషియల్ ప్రకటన రేపు పూజా కార్యక్రమాలు అంటూ విచ్చలవిడిగా వార్తలు వినిపించాయి.  ఆ హీరోయిన్ ..ఈ హీరోయిన్ .. సినిమా కేక ఇప్పటివరకు ఏ కాంబో ఇలా ఉండలేదు అంటూ రకరకాలుగా మాట్లాడుకున్నారు . బహుశా ఈ కాంబోకి దిష్టి తగిలిందో ఏమో త్రివిక్రమ్ సినిమాలో హీరోగా వెంకటేష్ కాదు అంటూ ఓ న్యూస్ తెరపైకి వచ్చింది . త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తన సినిమాలను చాలా డిఫరెంట్గా తెరకెక్కిస్తూ ఉంటాడు . అయితే ఇప్పుడు వెంకటేష్ ని తనదైన స్టైల్ లో దైరెక్ట్ చేయడానికి పూర్తిగా కథను సిద్ధం చేసుకున్నారట .


మొదటి నుంచి ఈ సినిమాని మల్టీ స్టారర్ గానే తెరకెక్కించాలి అంటూ త్రివిక్రమ్ ఫిక్స్ అయ్యారట . మొదటగా రామ్ - వెంకటేష్ లను ఈ స్టోరీలో అనుకున్నరట.  కానీ వెంకటేష్ ది లీడ్ పాత్ర కావడంతో వెంకటేష్ హైలెట్ అవుతాడు తన క్యారెక్టర్ తక్కువ అవుతుంది అంటూ రాం ఈ సినిమాను  రిజెక్ట్ చేశారట . ఆ తర్వాత ఆ రోల్ కోసం నానిని కూడా అప్రోచ్ అయ్యారట.  నాని ఇప్పుడు 100 కోట్ల హీరో అందుకే ఈ ప్రాజెక్టు ను రిజెక్ట్ చేసినంట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం త్రివిక్రమ్ తన పూర్తి కాన్సెప్ట్ ని మార్చేసారట.



ఇప్పుడు ఇద్దరి హీరోలతో ఈ సినిమా తెరకెక్కించాలి అని ప్లాన్ చేస్తున్నారట. త్రివిక్రమ్ లీడ్ క్యారెక్టర్ కోసం స్టార్ గా అనుకుంటున్నా హీరో మరెవరో కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే తనదైన స్టైల్ లో సినిమాలలో నటించి హ్యూజ్  ఫాలోయింగ్ సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ . అఫ్ కోర్స్ ఇప్పుడు పవర్ స్టార్  మాత్రమే కాదు ఏపీ డిప్యూటీ సీఎం కూడా . మరి అలాంటి పొజిషన్లో ఉన్న వ్యక్తి సినిమాలో నటిస్తాడా ..? అంటే త్రివిక్రమ్ - పవన్ బాండింగ్ చూసి ప్రతి ఒక్కరు ఆయన నటించిన ఆశ్చర్యపోనవసరం లేదు అంటున్నారు .



అంతేకాదు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ది లీడా క్యారెక్టర్ గా చేసి హీరో సాయి ధరమ్ తేజ్  ని సెకండ్ హీరోగా చూపించబోతున్నారట.  అంటే లెక్క ప్రకారం ఈ సినిమాలో హీరో పవన్ కళ్యాణ్ నే . మొదటినుంచి పవన్ అంటే త్రివిక్రమ్ కి ప్రాణం . మరి అలాంటి వ్యక్తి ని డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే ఇంకెంత హైలెట్గా ఆయన రోల్ ని తెరకెక్కిస్తాడు.. జనాలకి చూపిస్తాడు అనేది అందరికీ తెలిసిందే.  ప్రజెంట్ సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. అయితే పవన్ తన జాన్ జిగిడి దోస్తు కోసం సినిమాకి కమిట్ అవుతాడా..? లేదా..? అన్నది బిగ్ క్వశ్చన్ మార్క్ క్ గానే మిగిలిపోయింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: