
ఇలాంటి పరిస్థితుల మధ్య కర్ణాటకు చెందిన ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు కృత్రిమ మేధా సహాయంతో ‘లవ్ యు’ అనే సినిమా తీసారు. మూడు కంప్యూటర్లు రెండు ల్యాబ్ టాబ్ లు మాత్రమే వీరియొక్క పెట్టుబడి. ఈసినిమా తీయడానికి కేవలం 10 లక్షల పెట్టుబడి మాత్రమే అయిందని వీరిద్దరూ చెపుతున్నారు. వాస్తవానికి ఒక చిన్న బడ్జెట్ సినీనమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడానికి కనీసం 10 కావాలి.
అలాంటిది ఒక చిన్న సినిమాను 10 లక్షలతో తీశారు అంటే ఇది నమ్మలేని నిజం. ఈసినీమాలో నటించిన హీరో హీరోయిన్ పాత్రలతో పాటు మిగితా నటీనటులు అంతా యానిమేటెడ్ పాత్రలు అయినప్పటికీ ఆపాత్రలు పూర్తిగా సజీవమైన మనుష్యుల రూపాలతో ఉండటంతో ఈ ప్రక్రియ ఫిలిమ్ మేకింగ్ లో ఒక అద్భుతానికి శ్రీకారం చూడుతుంది అని అంటున్నారు. ఇలాంటి ప్రప్రక్రియతో సినిమాలు తీసే టెక్నిక్ రానున్న రోజులలో వృద్ధి చెందితే మరో 50-60 సంవత్సరాలు తరువాత సినిమాలు తీయడానికి హీరోలు హీరోయిన్స్ నటీనటులు అవసరం ఉండక పోవచ్చు.
నటీనటులు అంత కృత్రిమ మేధతో సృష్టింప బడ్డవారు కావడంతో ప్రేక్షకులకు సినిమా హీరోలను హీరోయిన్స్ ను ఆరాధించే ఆస్కారం ఉండకపోవచ్చి. అయితే నటన విషయంలో భావోద్వేగాలను చూపెట్టే సన్నివేశాలలో ప్రస్తుతానికి కృత్రిమ మేధతో తీసిన సినిమాలు లు అంత సహజంగా ఉండకపోయినప్పటికీ రానున్న రోజులలో ఈ లోటును కూడ అధికమించగలిగితే సినిమా నిర్మాణ రంగంలో పెను మార్పులు సంభవించడం ఖాయం. అదే జరిగితే సినిమా రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్న కొన్ని వేల కార్మికుల, సాంకేతిక నిపుణుల జీవనోపాధి ఏమౌవుతుంది అన్నది సమాధానంలేని ప్రశ్న..