సంక్రాంతి సినిమాలు తరువాత టాప్ హీరోల నుండి సినిమాలు విడుదల అవ్వకపోవడంతో సమ్మర్ సీజన్ అంతా డల్ గా నడిచింది. చిన్న ఊళ్ళలో కొన్ని ధియేటర్లు అయితే ప్రేక్షకులు లేక షోలు క్యాన్సిల్ చేసుకున్న పరిస్థితులు కూడ ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య  వచ్చేనెల జూన్ 12న విడుదలకాబోతున్న ‘హరి హర వీరమల్లు’ తో ధియేటర్లు కళకళ లాడుతాయని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

వాస్తవానికి ఈసినిమా పూర్తి కావాడానికి 5సంవత్సరాలు పైగా పట్టింది. పవన్ కళ్యాణ్ క్షణం తీరికలేని రాజకీయాలతో బిజీగా ఉండటంతో ఈసినిమా షూటింగ్ పూర్తి కావడానికి చాలకాలం పట్టింది. సినిమాల జయాపజయాలతో పవన్ మ్యానియా కొనసాగుతూ ఉంటుంది కాబట్టి ఈమూవీకి ఓపెనింగ్ కలక్షన్స్ విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. ఈమధ్య కాలంలో ప్రేక్షకులు చారిత్రాత్మక సినిమాలను బాగా ఆదరిస్తున్న నేపధ్యంలో ఈమూవీకి పాజిటివ్ టాక్ వస్తే కలక్షన్స్ విషయంలో రికార్డులను క్రియేట్ చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహంలేదు.

ఈమూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్న నేపధ్యంలో ఈమూవీ ప్రమోషన్ ను చాల భారీ స్థాయిలో చేస్తున్నారు. అయితే తన పనుల ఒత్తిడితో పవన్ ఈమూవీ ప్రమోషన్ లో పాల్గొనే అవకాశం లేకపోవడంతో హీరోయిన్ నిధి అగ్రవాల్ ఈమూవీ ప్రమోషన్ నిమిత్తం మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తోంది. ‘హరిహర వీరమల్లు’ కథ ఔరంగజేబు కాలం అయిన 17వ శతాబ్దం నేపధ్యంలో జరిగే కథ. ఈమూవీలో పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారని నిధి అగ్రవాల్ చెపుతోంది.

ఈ మూవీలోని పవన్ పాత్ర ఆయన నిజ జీవిత వ్యక్తిత్వాన్ని దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేసినట్లు ఆమె చెపుతోంది. ధనవంతుల నుంచి దోచుకుని పేదలకు పంచి పెట్టే పాత్రలో పవన్ కనిపిస్తాడని నిధి లీకులు ఇస్తోంది. ఈమూవీ కథ కొంతవరకు కోహినూర్ వజ్రం చుట్టూ తిరుగుతుందని అయితే క్రిష్ మొదట్లో ఈమూవీ కోసం వ్రాసుకున్న కథలో ప్రస్తుతం ఈసినిమాకు దర్శకత్వం వహించిన జ్యోతి కృష్ణ చాలమార్పులు చేర్పులు చేసినట్లు సమాచారం..


మరింత సమాచారం తెలుసుకోండి: