పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పవన్ కళ్యాణ్ చాలా కాలం క్రితం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమాను మొదలు పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పలుమర్లు స్టార్ట్ అవుతూ ఆగిపోతూ రావడంతో ఈ మూవీ దర్శకత్వ బాధ్యతలు నుండి క్రిష్ తప్పుకున్నాడు. దానితో కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన రూల్స్ రంజన్ మూవీ కి దర్శకత్వం వహించిన జ్యోతి కృష్ణ ఈ మూవీ కి సంబంధించిన మిగిలిన భాగం షూటింగ్ను పూర్తి చేశాడు. మొత్తం ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

అందులో మొదటి భాగాన్ని జూన్ 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో ఈ మూవీ ఈ సినిమాకు సంబంధించిన ఒక్కో పాటను విడుదల చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన మూడు పాటలను విడుదల చేశారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి తార తార అంటూ సాగే సాంగ్ ను విడుదల చేశారు. ఈ మూవీ బృందం వారు తాజాగా విడుదల చేసిన తార తార అంటూ సాగే సాంగ్ కి విడుదల 24 గంటల్లో పర్వాలేదు అనే స్థాయి రెస్పాన్స్ లభించింది.

మూవీ లోని తార తార సాంగ్ కి విడుదల అయిన 24 గంటల్లో 7.40 మిలియన్ వ్యూస్ ... 135.4 కే లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీలోని తార తార సాంగ్ కి 24 గంటల్లో మంచి రెస్పాన్స్ అయినప్పటికీ ఈ మూవీ నుండి కొన్ని రోజుల క్రితం మేకర్స్ హాసుర హరణం అనే సాంగ్ ను విడుదల చేసింది. దీనికి విడుదల అయిన 24 గంటల్లో ఏకంగా 19.93 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇప్పటివరకు తెలుగు సినీ పరిశ్రమలో విడుదల అయిన 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన సాంగ్స్ లో ఈ సాంగ్ నాలుగవ స్థానంలో నిలిచింది. ఇక అసుర హననం సాంగ్ స్థాయిలో తారా తారా సాంగ్ 24 గంటల్లో ఇంపాక్ట్ చూపలేకపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: