
ముగ్గురికి ముగ్గురే వాళ్ళని ఏ విషయంలో తీసి పడేయలేము. ప్రజెంట్ పలు సినిమాలతో బిజీ బిజీగా ముందుకు వెళ్తున్నారు . అయితే ఈ ముగ్గురు ఓ హీరోయిన్ ని తమ సినిమాలో వద్దు అంటూ రిజెక్ట్ చేశారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి. చరణ్ "పెద్ది" సినిమాలో ముందుగా హీరోయిన్ గా "స్రద్ధా కపూర్" ని అనుకున్నారట మేకర్స్. కానీ రామ్ చరణ్.. ఈ పాత్రకి ఆమె బాగోదు అంటారు రిజెక్ట్ చేశారట.
ఆ తర్వాత ప్రశాంత్ నీల్ కాంబోలో జూనియర్ ఎన్టీఆర్ నటింస్తున్న సినిమా కోసం కూడా శ్రద్ధా కపూర్ ని అనుకున్నారట, సేమ్ టు సేమ్ ఈ క్యారెక్టర్ కి ఆమె సెట్ అవ్వద్దు అంటూ ఎన్టీఆర్ రిజెక్ట్ చేసారట. ఇక అల్లు అర్జున్ - అట్లీ కాంబోలో తెరకెక్కే సినిమా కోసం స్రద్ధా కపూర్ ని అనుకున్నారట మూవీ మేకర్స్ . కానీ అల్లు అర్జున్ మాత్రం అసలు ఒప్పుకోలేదట . ఈ పాత్రకి న్యాయం చేయలేకపోవచ్చు అంటూ సున్నితంగా రిజెక్ట్ చేశారట . ఆలా ముగ్గురు టాప్ తెలుగు హీరోస్ చేత రిజెక్ట్ చేయించబడింది శ్రద్ధా కపూర్ అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమెను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు జనాలు. ప్రభాస్ "సాహో" సినిమాలో నటించింది శ్రద్ధా కపూర్. కానీ అమ్మడి పర్ఫామెన్స్ ఆకట్టుకోలేకపోయింది . అప్పటి నుంచి శ్రద్ధా కపూర్ తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవాలంటే గగనంగా మారిపోయింది..!