
ఈ సినిమాలో తారక్ పాత్ర నిడివి గురించి ఎన్నో సందేహాలు నెలకొనగా వార్2 ప్రమోషన్స్ లో భాగంగా ఆ ప్రశ్నలకు జవాబు దొరికే ఛాన్స్ అయితే ఉంది. అయితే తారక్ లైనప్ మారగా త్రివిక్రమ్ ఎంట్రీతో జూనియర్ ఎన్టీఆర్ లెక్కలు మారిపోయాయా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. దేవర2 విషయంలో ట్విస్ట్ ఉండబోతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేవర2 ఇప్పట్లో తెరకెక్కడం కష్టమేనని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
బన్నీ మిస్ చేసుకున్న కథలో ఎన్టీఆర్ నటిస్తుండటం ఒకింత సంచలనం అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ నెల్సన్ ప్రాజెక్ట్ కూడా ఆగిపోలేదని అనుకున్న ప్రకారమే ఈ సినిమా షూటింగ్ జరగనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ హారిక హాసిని బ్యానర్ లో వరుస సినిమాలలో నటిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ కెరీర్ కు ఎంతమేర ప్లస్ అవుతుందో చూడాలి.
స్టార్ డైరెక్టర్ రాజమౌళి అందరు టాలీవుడ్ హీరోలకు పాన్ ఇండియా ఇమేజ్ ను తెచ్చిపెడుతుండటం గమనార్హం. రాజమౌళిని ఈ విషయంలో ఎంత మెచ్చుకున్నా తక్కువేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజమౌళి పారితోషికం ప్రస్తుతం 200 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ఇతర భాషల్లో సైతం మార్కెట్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సాధిస్తున్న రికార్డులు అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు