ఏ విషయంలో శోభిత కంటే జైనబ్ రావడ్జి తోపు.. ఇంతకీ అక్కినేని ఫ్యామిలీలో ముందుగా వచ్చిన పెద్ద కోడలు శోభిత కంటే వెనక వచ్చిన జైనబ్ రావడ్జి ఎక్కువనా..అది ఏ విషయంలో అని తెలుసుకోవాలనే ఆత్రుత ప్రతి ఒక్క అక్కినేని అభిమానికి ఉంటుంది.శోభిత కంటే జైనబ్ ఏ విషయంలో ఎక్కువ అంటే.. కట్నకానుకల విషయంలో. అవును మీరు వినేది నిజమే. జైనబ్ రావడ్జి వ్యాపార నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చింది. కాబట్టి పుట్టింటి నుండి మెట్టినింటి కి వచ్చేటప్పుడు కట్న కానుకలు భారీగానే తెచ్చిందట.. అయితే ఈ విషయంలో శోభిత కంటే ఎక్కువ కట్నం తీసుకువచ్చినట్టు తెలుస్తుంది.. 

జైనబ్ రావడ్జి పెళ్లైన సమయంలో ఆమె తండ్రి జుల్ఫీ రావడ్జి అల్లుడు మీద ప్రేమతో ఒక బిఎండబ్ల్యూ కార్ తో పాటు రెండు ఆడి కార్లను గిఫ్ట్ గా ఇచ్చారట. అంతేకాకుండా అల్లుడికి డైమండ్ బ్రేస్లెట్ తో పాటు హైదరాబాదులోని విల్లా,దుబాయ్ లోని లగ్జరీ అపార్ట్మెంట్ ని కూతురికి కట్నం కింద రాసిచ్చారట.అలాగే కూతురికి పెళ్లిలో రెండు డైమండ్ నెక్లెస్ ల తో పాటు ఇప్పటివరకు ఆమె సంపాదించిన ఆస్తి కూడా ఆమెకే ఇచ్చేసారట.అలాగే తనకు ఒక్కగానొక్క కూతురు కాబట్టి నా ఆస్తిలో సగం వాటా కూడా నా కూతురికి ఇస్తాను అని పెళ్లికి ముందే జైనబ్ తండ్రి అక్కినేని ఫ్యామిలీకి మాట ఇచ్చారట..

అలా అక్కినేని నాగార్జున ఇంటికి చిన్న కోడలుగా అఖిల్ కి భార్యగా వచ్చిన జైనబ్ రావడ్జి కట్నం కూడా భారీగానే తెచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ లెక్కన శోభిత కంటే జైనబ్ ఎక్కువ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే శోభిత కూడా రిచ్ ఫ్యామిలీ అయినప్పటికీ జైనబ్ అంత రిచ్ అయితే కాదు.అందుకే కట్నకానుకల విషయంలో ముందుగా వచ్చిన పెద్ద కోడలు శోభిత కంటే వెనక వచ్చిన చిన్న కోడలు జైనబ్ ఎక్కువ తెచ్చింది అంటూ సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: