సినిమా ఇండస్ట్రీ లోకి రావడం అంత ఈజీ కాదు వచ్చినా కూడా సినిమాలను హిట్ చేసుకునే అంత స్థాయికి వెళ్లడం చాలా చాలా టఫ్ . అది హీరో కావచ్చు హీరోయిన్ కావచ్చు ..కమెడియన్ కావచ్చు డైరెక్టర్ కావచ్చు .. ప్రతి ఒక్కరికి కూడా సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి సక్సెస్ కావడం అనేది చాలా చాలా గగనైనా విషయం . అయితే సినిమా ఇండస్ట్రీలోకి రావాలి అని మంచి లైఫ్ లో సెటిల్ అవ్వాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు . అనుకుంటే సరిపోదు తనకి తగ్గ కష్టం - శ్రమ అన్ని పడాలి. అలా పడిన తర్వాత  ఆ సక్సెస్ వస్తే  ఆ ఎంజాయ్మెంట్  వేరే లెవల్ .


ప్రజెంట్ అలాంటి ఎంజాయ్ మెంట్ ని  ఫీల్ అవుతున్నాడు డైరెక్టర్ మారుతి . డైరెక్టర్ మారుతి అంటే ఇప్పుడు ఒక పెద్ద స్టార్ డైరెక్టర్ . కానీ ఒకప్పుడు మాత్రం డైరెక్టర్ మారుతి అంటే కామెడీ సినిమాలు తీసుకుంటాడే అతగాడా.. అని  చెప్పుకునే వాళ్ళు జనాలు . ఆ స్థాయి నుంచి ఇప్పుడు ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడే అతడే అయ్యా మారుతి అని చెప్పే స్థాయికి ఎదిగాడు మారుతి . మారుతి ప్రభాస్ తో రాజా సాబ్  అనే సినిమాను చేస్తున్నాడు . మారుతి ప్రమోషన్స్ ని కూడా భారీగానే ప్లాన్ చేశారు . రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ అయింది . దీనికి ముందే రాజా సాబ్  డైరెక్టర్ మారుతి ఎమోషనల్  పోస్ట్ షేర్ చేశారు.



దీనితో ఒక్కసారిగా ఆయన పేరు మారుమ్రోగిపోతుంది . డైరెక్టర్ మారుతి ప్రభాస్ తో తన కటౌట్ ఉన్న ఫోటోను షేర్ చేస్తూ .."ఈ ప్లేస్ లో ఒకప్పుడు మా నాన్న ఒక చిన్న స్టాల్ పెట్టి అరటి పండ్లు పెట్టుకొని అమ్మేవాడు . నాకు ఇంకా గుర్తుంది నేను కూడా ఇక్కడే కట్టే బ్యానర్స్ రాసే వాడిని.. ఆ బ్యానర్స్ పై ఒక్కసారైనా నా పేరు చూసుకోవాలి అనే కోరిక ఉండేది ..అలాగే కలలు కన్నాను. ఎక్కడ మొదలుపెట్టానో ఇప్పుడు అక్కడే వెనక్కి తిరిగి చూసుకుంటే నా లైఫ్ సైకిల్ లా అనిపిస్తుంది . నేను మొదలుపెట్టిన చోటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పాటు నాకు కటౌట్ పెట్టారు . ఈ జన్మకి ఇది చాలు.  మా నాన్న ఇది చూసి ఉంటే గర్వంగా ఫీల్ అయ్యే వాళ్ళు.. మిస్ యు నాన్న నేను ఇప్పుడు మోస్తున్న కృతజ్ఞతకు ధన్యవాదాలు అనేది చాలా చాలా తక్కువ విషయం గా అనిపిస్తూ ఉంటుంది " అంటూ ఎమోషనల్ గా తన మాటలను పోస్ట్ రూపంలో షేర్ చేశారు . దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.  కొంతమంది రియల్ సక్సెస్ అంటే నువ్వే ఇండస్ట్రీలో రియల్ సక్సెస్ దక్కించుకుంటే ఆ కిక్కే వేరు అంటూ మారుతిని ఓరేంజ్ లో పొగిడేస్తున్నారు..!!



మరింత సమాచారం తెలుసుకోండి: