రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నీది అగర్వాల్ , మాళవిక మోహన్ , రీద్ధీ కుమార్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తూ ఉండగా ... పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టీ జీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ను నిన్న మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న నిధి అగర్వాల్ తన కెరియర్ లో ఫస్ట్ టైమ్ రాజా సాబ్ సినిమా ట్రైలర్ కోసం సొంతగా డబ్బింగ్ చెప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇలా నిధి అగర్వాల్ కెరియర్ లో మొట్ట మొదటి సారి రాజా సాబ్ మూవీ ట్రైలర్ కు డబ్బింగ్ చెప్పుకున్నట్లు సమాచారం.

ఇకపోతే ఈ మూవీ కనుక మంచి విజయం సాధించినట్లయితే నిధి అగర్వాల్ క్రేజ్ తెలుగు సినీ పరిశ్రమలో భారీగా పెరిగే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. నిధి అగర్వాల్ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందిన హరిహర వీరమల్లు సినిమాలో కూడా హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ని జూన్ 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ చివరి నిమిషంలో ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేశారు. ఈ మూవీ విడుదల తేదీని మరికొన్ని రోజుల్లో ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Na