
మనకు తెలిసిందే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కోలీవుడ్ హీరో ధనుష్ తాజాగా నటించిన సినిమా "కుబేర". అక్కినేని నాగార్జున కీలకపాత్రలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా జూన్ 20వ తేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదలై పాజిటివ్ టాక్ అందుకుంది . రిలీజ్ అయిన ప్రతి చోట కూడా మార్వులెస్ రెస్పాన్స్ అందుకుంది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో చాలామంది కుబేర టీం ని ప్రశంసిస్తున్నారు. ఇంకా పోగిడేస్తున్నారు . స్టోరీ లైన్ అదిరిపోయింది అని ధనుష్ పర్ఫామెన్స్ వేరే లెవల్ అని చాలా చాలా పాజిటివ్ గా స్పందిస్తున్నారు.
మరి ముఖ్యంగా దేవిశ్రీప్రసాద్ ఎలివేషన్ కొన్ని సీన్స్ ను బాగా పైకి లేపాయ్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు . శేఖర్ కమ్ముల ఉన్న కధను నిజాయితీగా తెరకెక్కించారు అంటూ ఆయన మేకింగ్ టేకింగ్ నెక్స్ట్ లెవల్ అంటూ పొగిడేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో కుబేర కి సంబంధించిన పాజిటివ్ కామెంట్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి . అయితే ఇదే మూమెంట్లో కొంతమంది ఆకతాయిలు తెలుగు డైరెక్టర్లు కోలీవుడ్ హీరోలతో సినిమా తీస్తే అది సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని .. అదే కోలీవుడ్ డైరెక్టర్లు మన తెలుగు హీరోలతో సినిమా తీస్తే మాత్రం పరమ ఫ్లాప్ అవుతుంది అంటూ గతం తాలుక జ్ఞాపకాలను మరొకసారి తవ్వి లోడి ట్రోల్ చేస్తున్నారు .
తెలుగు హీరోలతో - తమిళ్ డైరెక్టర్లు చేసిన మూవీలను కూడా మరొకసారి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. మురుగ దాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన సినిమా "స్పైడర్". ఈ సినిమా అభిమానులను ఆకట్టుకోలేకపోయింది . కేవలం ఈ సినిమా మాత్రమే కాదు రీసెంట్ గా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిన గేమ్ చేంజర్ సినిమా కూడా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. రామ్ చరణ్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన "గేమ్ చేంజర్" అట్టర్ ఫ్లాప్ అయింది .
ఇక నాగచైతన్య నటించిన "కస్టడి"..రామ్ నటించిన "వారియర్" సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదే మన తెలుగు డైరెక్టర్లు తమిళ హీరోలతో తీసిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మరీ ముఖ్యంగా ధనుష్ తో వెంకి అట్లూరి తెరకెక్కించిన "సార్" .. మలయాళంలో హీరో దుల్కర్ సల్మాన్ తో తెరకెక్కిన "లక్కీ భాస్కర్".. కార్తీతో వంశీ పైడిపల్లి తీసిన "ఊపిరి".. మంచి హిట్ టాక్ అందుకున్నాయి. అంతేకాదు తాజాగా శేఖర్ కమ్ముల కోలీవుడ్ హీరో ధనుష్ తో తెరకెక్కించిన "కుబేర" కూడా ఫస్ట్ షో నుంచి హిట్ టాక్ అందుకుంది . ఇంకేముంది సోషల్ మీడియాలో తమిళ్ ఫ్యాన్స్ వర్సెస్ తెలుగు ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధాలు చేసుకుంటున్నారు. తెలుగు డైరెక్టర్ లని ని చూసి కోలీవుడ్ దర్శకులు ఇప్పటికైనా నేర్చుకోవాలి అంటూ కావాలనే ట్రోల్ చేస్తున్నారు . ఇకనైనా మిమ్మల్ని నమ్మి ఛాన్స్ ఇచ్చిన తెలుగు హీరోలకు లైఫ్ ఇవ్వండి రా బాబు అంటూ కూసింత ఘాటు పదాజాలంతోనే పోస్టులు పెడుతూ సోషల్ మీడియాలో మీమ్‌స్ క్రియేట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు..!