మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం మాస్ జాతర అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీ లీల , రవితేజకు జోడిగా నటిస్తుంది. రవితేజకు ఈ మధ్య కాలంలో విజయాలు లేవు. రవితేజకు ఆఖరి విజయం ధమాకా మూవీతో దక్కింది. ఈ సినిమాలో రవితేజకు జోడిగా శ్రీ లీల నటించింది. దానితో రవితేజ , శ్రీ లీల కాంబోలో రూపొందుతున్న సినిమా కావడంతో మాస్ జాతర సినిమా కూడా మంచి విజయం సాధిస్తుంది అని రవితేజ అభిమానులు గట్టిగా నమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో నవీన్ చంద్ర విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే రవితేజ ప్రస్తుతం మాస్ జాతర సినిమాతో పాటు కిషోర్ తిరుమల దర్శకత్వంలో కూడా ఓ మూవీ లో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతికి కచ్చితంగా విడుదల చేయాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశారు.

ఈ మూవీలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లు రవితేజకు జోడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. రవితేజ , కిషోర్ తిరుమల కాంబోలో రూపొందబోయే సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణులు అయినటువంటి కేతిక శర్మ , మమితా బైజు , కయాదు లోహర్ హీరోయిన్లుగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే కెరియర్ ప్రారంభం నుండి అపజాలను అందుకున్న కేతికా శర్మ తాజాగా సింగిల్ మూవీ తో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక మమత బైజు "ప్రేమలు" సినిమాతో మంచి విజయాన్ని , మంచి గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకుంది. డ్రాగన్ మూవీ తో ఖయాదూ లొహర్ సూపర్ సాలిడ్ విజయాన్ని , మంచి గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకుంది. ఇలా రీసెంట్ గా సూపర్ హిట్స్ అందుకున్న ముగ్గురు డ్యూటీలు రవితేజ నెక్స్ట్ మూవీ లో హీరోయిన్లుగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: