"కుబేర".. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ట్ డైరెక్టర్గా పాపులారిటి సంపాదించుకున్న శేఖర్ కమ్ముల రీసెంట్గా తెరకెక్కించిన సినిమా. కోలీవుడ్ స్టార్  ధనుష్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్గా నాగార్జున కీలకపాత్రలో మెరిసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బీభత్సమైన పాజిటివ్ టాక్ దక్కించుకుంది . మొదటి నుంచి సినిమాపై పాజిటివ్ కామెంట్స్ ఎక్కువుగా వినిపిస్తూ  వచ్చాయి . సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం ఒకరు కాదు ఇద్దరు కాదు వేలల్లో లక్షల్లో జనాలు ధనుష్ పెర్ఫార్మన్స్ బై పాజిటివ్ గా స్పందిస్తున్నారు.


అంతేకాదు ఈ సినిమా కలెక్షన్స్ పరంగా కూడా జెట్ స్పీడ్ లో ముందుకు దూసుకెళ్ళిపోతుంది . రోజురోజుకి ఈ చిత్రం అనూహ్యంగా మంచి కలెక్షన్స్ రాబడుతూనే ఉంది . లేటెస్ట్ గా ఈ సినిమా నైజాం వసుళ్లకు సంబంధించిన అఫీషియల్ కలెక్షన్ డీటెయిల్స్ బయటకు వచ్చాయి.  దీంతో సోషల్ మీడియాలో నైజాం ఏరియాలో "కుబేర" మూవీ కలెక్షన్స్ వైరల్ అవుతున్నాయి . కాగా  ఈ సినిమా మొదటిరోజు దాదాపు 2.7 కోట్లు నైజాం ఏరియాలో షేర్ సాధించినట్లు ప్రకటించారు చిత్ర బృందం.



ఆశ్చర్యం ఏంటంటే మొదటి రోజు కన్నా రెండవ రోజు  కలెక్షన్స్ మరింత పెరిగాయి . దాదాపు ఒక కోటి కి పైగానే పెరిగాయి.  రెండవ రోజు "కుబేర"  సినిమా నైజాం ఏరియాలో దాదాపు 3.2 కోట్ల వసూలు చేసినట్లు తెలుస్తుంది . మొత్తం రెండు రోజులకు గాను 5.9 కోట్లు రాబట్టింది అంటూ చిత్ర బృందం ప్రకటించింది.  మొత్తానికి తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా నైజాంలో కుబేర సినిమాకు మంచి ఆదరణ లభిస్తుంది. అంతేకాదు ఈరోజు ఆదివారం కాబట్టి కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.



పైగా ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఈ సినిమా అట్రాక్ట్ చేస్తుంది . చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ కూడా కనిపిస్తున్నాయి . ఈ లెక్కన చూసుకుంటే నైజాంలో మరొక రికార్డు క్రియేట్ చేసేదానికి రెడీగా ఉంది కుబేర అని చెప్పుకోవచ్చు . కేవలం నైజాం ఏరియాలో మాత్రమే కాదు రిలీజ్ అయిన అన్నిచోట్ల కూడా కుబేర సెన్సేషనల్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. సాధారణంగా మొదటి రోజు మాత్రమే కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయి . రెండో రోజు మూడో రోజు అది పడిపోతుంది . కాని కుబేర విషయంలో మాత్రం మొదటి రోజు కంటే రెండో రోజు కలెక్షన్స్ ఎక్కువగా ఉండటం గమనార్హం..!

మరింత సమాచారం తెలుసుకోండి: