టాలీవుడ్ యువ నటుడు నితిన్ "జయం" అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. తేజ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సదా హీరోయిన్గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సమయంలో నితిన్ వయసు చాలా తక్కువ. అలా తక్కువ వయసులోనే ఈయన మంచి విజయాన్ని అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత కొంత కాలం పాటు ఈయన అద్భుతమైన జోష్లో కెరీర్ను కొనసాగించాడు.

ఆ తర్వాత ఈయన వరుస పెట్టి భారీ అపజయాలను సొంతం చేసుకున్నాడు. అలాంటి సమయం లోనే ఈయన ఇష్క్ మూవీ తో మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఈ మధ్య కాలంలో మళ్ళీ నితిన్ వరుస పెట్టి భారీ అపజయాలను అందుకుంటూ వస్తున్నాడు. ఆఖరుగా నితిన్ "రాబిన్ హుడ్" అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ కి సంబంధించిన ప్రమోషన్లను చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ వచ్చాడు. ఈ సినిమా విడుదలకు ముందు రాబిన్ హుడ్ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుంది అని గట్టి నమ్మకంతో నితిన్ చెబుతూ వచ్చాడు. కానీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహ పరిచింది. ప్రస్తుతం నితిన్ "తమ్ముడు" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని మరికొన్ని రోజుల్లో విడుదల చేయనున్నాడు.

కొన్ని రోజుల క్రితం ఓ ఈవెంట్లో భాగంగా నితిన్ మాట్లాడుతూ ... నా పూర్వపు సినిమా విషయంలో నేను చాలా ఎక్కువ మాట్లాడాను. ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అందుకే నేను తమ్ముడు సినిమా విషయంలో ఎక్కువ మాట్లాడను. సినిమా విడుదల అయ్యాక సినిమానే మాట్లాడుతుంది అన్నాడు. దానితోనే అర్థం అవుతుంది నితిన్ "రాబిన్ హుడ్" సినిమాకు చేసిన స్థాయి ప్రమోషన్లు ఈ మూవీ కి చేయడం కష్టం అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: