ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నారు. కుర్ర హీరోయిన్లు ఎంతోమంది వస్తున్నారు. జనాలకి మాత్రం తమ ఫేవరెట్ గా కొంతమంది హీరోయిన్లు సెట్ అవుతూ ఉంటారు . ఒకసారి అలా సెట్ అయిన వాళ్ళని అసలు వదలనే వదలరు . అంత బాగా లైక్ చేస్తూ ఉంటారు. కాగా  అలాంటి లిస్టులో కోలీవుడ్ స్టార్ హీరోయిన్ హన్సిక మోత్వానికి కూడా ఉంటారు . హన్సిక ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బనీ సరసన దేశముదురు సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది .


పూరి జగన్నాధ్  దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అల్లాడించేసింది . మరి ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు అప్పట్లో మంటలెక్కించేసేయ్. ఆ టైంలో కుర్రాలకి ఈ పాటలు ఫేవరేట్ అని చెప్పుకోవడంలో సందేహమే లేదు . కాగా తెరపై హన్సిక  - బన్నీ నటన , కెమిస్ట్రీకూడా చాలా చాలా ముద్దుగా - చక్కగా - క్యూట్గా అనిపించింది . ఆ తర్వాత హన్సిక పలు తెలుగు సినిమాలు అదే విధంగా కోలీవుడ్ సినిమాలు చేసింది. తెలుగులో పెద్దగా క్లిక్ అవ్వలేదు కోలీవుడ్లో మాత్రం స్టార్ హీరోయిన్గా మారిపోయింది .



పెళ్లి కూడా చేసుకుంది . అయితే పెళ్లి తర్వాత వచ్చిన అవకాశాలతో లైఫ్ నెట్టుకు వస్తున్న హన్సిక ఇప్పుడు తెలుగు స్టార్ హీరో కోసం ఐటం గర్ల్ గా మారింది అన్న న్యూస్ బాగా వైరల్ అవుతుంది. హన్సిక ఎప్పుడు కూడా ఐటమ్  సాంగ్స్ లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించదు . గతంలో బిల్లా సినిమాలో కూడా కొంచెం సేపు అలా కనిపించి  ఒక స్పెషల్ సాంగ్లో మెరిసి కనుమరుగు అవుతుంది.  అయితే ఇప్పుడు హన్సిక తన తెలుగు వన్ ఆఫ్ ద ఫేవరెట్ హీరో కోసం స్పెషల్ సాంగ్ లో నటించాలి అంటూ ఓకే చేసిందట . ఆ హీరో మరెవరో కాదు "చిరంజీవి".



ఎస్ మెగాస్టార్ చిరంజీవి కోసం ఆమె స్పెషల్ సాంగ్ లో నటించడానికి ఓకే చేసిందట.  అనిల్ రావిపూడి  దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్గా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే . ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా కీలకపాత్రలో కనిపించబోతున్నారని టాక్. తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది . ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో హన్సిక ను చూపించబోతున్నాడట అనిల్ రావిపూడి.  చాలా చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తూ ఉంటాడు  ఈ డైరెక్టర్. ఆ కారణంగానే సైలెంట్ హీరోయిన్ హన్సిక చేత ఇలా హాట్ ఐటమ్ సాంగ్ చేయించబోతున్నారట. ప్రజెంట్ టాలీవుడ్ సర్కిల్స్ లో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: