
ఎందుకంటే రమణ లో ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు. సాంగ్స్ ఉండవు. పైగా క్లైమాక్స్ లో హీరో క్యారెక్టర్ చనిపోతుంది. దాంతో రమణ రీమేక్ చేయవద్దని చిరంజీవికి చాలామంది చెప్పారట. కానీ థైర్యంగా ఆయన ముందడుగు వేశారు. దర్శకత్వ బాధ్యతలు తీసుకున్న వినాయక్.. చిరంజీవి ఇమేజ్ కు తగ్గట్లు కథలో పలు మార్పులు చేశారు. సాంగ్స్ ను జోడించడంతో పాటు క్లైమాక్స్ ను ఛేంజ్ చేసి సినిమాను తెరకెక్కించారు.
2003 సెప్టెంబర్ 24న విడుదలైన ఠాగూర్ మూవీ మొదటి రోజు డివైడ్ టాక్ తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత ఠాగూర్ ప్రేక్షకులకు స్లో పాయిజన్‌లా ఎక్కేసింది. 600కు పైగా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఠాగూర్.. 253 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. అలాగే 191 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఫుల్ రన్ లో రూ. 27.65 కోట్ల షేర్ రాబట్టి భారీ లాభాలను తెచ్చిపెట్టింది.
చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. ఠాగూర్ మూవీకి ఫస్ట్ ఛాయిస్ చిరంజీవి కాదు. మొదట ఠాగూర్ మేకర్స్ యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ ను సంప్రదించారు. అయితే రమణ మూవీ చూసిన రాజశేఖర్.. తెలుగులో రీమేక్ చేస్తే వర్కోట్ కాదని భావించి రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత స్టోరీ విన్న చిరంజీవి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కట్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. చిరు కెరీర్ లో ఉన్న బెస్ట్ ఫిల్మ్స్ లో ఒకటిగా మారింది.