మంచు విష్ణు భార్య విరాణిక ఓ క్రిస్టియన్ అనే సంగతి మనకు తెలిసిందే. అయితే ఆమె ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు విష్ణు తల కింద ఒకటి పెడుతుందట.దానివల్ల మంచు విష్ణు లో ఏదైనా దుష్ట శక్తులు ఉంటే పారిపోతాయి అనే ఉద్దేశ్యంతోనే విరాణిక అలాంటి పనిచేస్తుందట. మరి ఇంతకీ పడుకునే ముందు మంచు విష్ణు తలగడ కింద విరాణిక పెట్టేది ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప మూవీ ప్రమోషన్స్ ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. మరో మూడు రోజుల్లో విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి మనకు తెలిసిందే. అయితే మరోసారి శ్రీకాళహస్తిలో కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించాలని, ఈ ఈవెంట్ కి ప్రభాస్ ని గెస్ట్ గా పిలవాలని కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది.

కానీ మూడు రోజులే ఉండడంతో ఇది సాధ్యమవుతుందో లేదో తెలియదు. ఇక మంచు విష్ణు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను ఓ హార్డ్ కోర్ హిందువుని..కానీ నా భార్య మాత్రం క్రిస్టియన్..ఆమె ప్రతిరోజు బైబిల్ చదివే పడుకుంటుంది. ఇక నేను పడుకున్న తర్వాత ఆ బైబిల్ ని నా తలగడ కింద ఉంచుతుంది. ఎందుకంటే నాలో ఏమైనా దుష్టశక్తులు ఉంటే పారిపోతాయి అని ఆమె నమ్మకం. ఇక నాకు మాత్రం గుడికి వెళ్తేనే ప్రశాంతంగా అనిపిస్తుంది.అయితే దేవుడు అన్నిచోట్లా ఉంటాడు.

కానీ గుడికి వెళ్తే ఆ ప్రశాంతత వేరేగా ఉంటుంది.. ఇక కన్నప్ప మూవీ క్లైమాక్స్ ఏంటో అందరికీ తెలిసిందే. కానీ చాలామంది కన్నప్ప సినిమాని క్లైమాక్స్ కంటే ముందు ఎవరి ఊహలకు తగ్గట్టు వాళ్ళు చిత్రీకరించారు. అలా మేం అధ్యయనం చేసిన దాని ప్రకారం కన్నప్ప మూవీ ని తెరకెక్కించాం. 50 ఏళ్ల తర్వాత మరోసారి కన్నప్ప మూవీ రాబోతుంది. ఇప్పుడున్న జనరేషన్ రాబోయే జనరేషన్  కూడా ఈ సినిమా ద్వారా నేర్చుకోవాలని మేము కన్నప్ప సినిమాని తీసాము. ఇది ఆ శివుడి ఆజ్ఞతోనే నేను తీసినట్టు అనుకుంటాను అంటూ మంచు విష్ణు చెప్పుకొచ్చారు.ఇక కన్నప్ప మూవీ జూన్ 27న భారీ ఎత్తున విడుదల కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: