"కన్నప్ప".. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ మూవీ గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు . విష్ణు హీరోగా మోహన్ బాబు - ప్రభాస్ - కాజల్ అగర్వాల్ - మోహన్లాల్ - అక్షయ్ కుమార్ కీలకపాత్రలో నటిస్తున్న సినిమానే ఈ కన్నప్ప . కన్నప్ప సినిమాలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తూ ఉండడంతో ఆయన ఫ్యాన్స్ ఈ మూవీ చూసేందుకు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . ఫస్ట్ టైం ప్రభాస్ చాలా డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు అని రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ ఆధారంగా తెలిసిపోయింది.


అందరూ చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఈ సినిమా చూడటానికి వెయిట్ చేస్తున్నారు.  ప్రభాస్ ఫస్ట్ టైం తన కెరియర్ లో గెస్ట్ రోల్ చేస్తున్నాడు . అందుకే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇతర ఫంక్షన్ కి కూడా ఆయన ఫ్యాన్స్ వెళ్తున్నారు.  కన్నప్ప మూవీ లో ప్రభాస్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. రచయిత బివిఎస్ రవి .. ప్రభాస్ ఎంట్రీ గురించి ఓ హైలెట్ న్యూస్ చెప్పేశారు. కన్నప్ప మూవీలో ప్రభాస్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని..  ఇంటర్వెల్ తర్వాత 15వ నిమిషంలో ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది అని తెలిపారు.  ప్రభాస్ ఎంట్రీ తర్వాత మూవీ వేరే లెవెల్ కి వెళ్తుంది అని దాదాపు 26 నిమిషాల పాటు ప్రభాస్ తెర పై కనిపిస్తాడు అని .. ఇది చాలా చాలా రెబల్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది అని కూడా చెప్పుకొచ్చారు .



అయితే ఇదే క్రమంలో ప్రభాస్ "కన్నప్ప" సినిమా కోసం ఎన్ని కాల్ షీట్లు ఇచ్చాడు అనే విషయం కూడా హైలెట్ అవుతుంది. 26 నిమిషాలు అంటే దాదాపు అరగంట పాటు ఈ సినిమాలో ప్రభాస్ కనిపిస్తాడు . అయితే ప్రభాస్ ఈ సినిమాకి ఎన్ని నెలలు కాల్ షీట్స్  ఇచ్చి ఉంటారు అనేది ఇంట్రెస్టింగ్ గా ట్రెండ్ అవుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ప్రభాస్ ఈ సినిమాకి కేవలం ఏడంటే ఏడు రోజులు మాత్రమే కాల్ షీట్స్ ఇచ్చారట. ఈ  సినిమా కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. కేవలం  ఫ్రెండ్షిప్ అదే విధంగా మోహన్ బాబు అంటే ఉన్న గౌరవం మీదనే ఈ సినిమాని చేశారట.  వరుసగా ఏడు రోజులకు కాల్ షీట్స్ షెడ్యూల్ మొత్తం కంప్లీట్ చేసేసాడట ప్రభాస్ . ఇప్పటివరకు ప్రభాస్ తన కెరియర్ లో ఎప్పుడు కూడా ఏడు రోజుల్లో ఒక సినిమాని కంప్లీట్ చేసిన దాఖలాలే లేవు . అలా ఈ సినిమా ప్రభాస్ కెరియర్లో ఒక రికార్డు క్రియేట్ చేసింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: