ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్గా భారీ క్రేజీ సంపాదించుకున్న హీరోయిన్ రష్మిక గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ ఏడాది ఈమె నటించిన ఛావా, కుబేర వంటి చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు తాజాగా రష్మిక మరొక ప్రయోగాత్మకంగా సినిమాకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.. అన్ ఫార్ములా ఫిలిమ్స్ బ్యానర్ పైన ఈ ప్రాజెక్టుని తెరకెక్కిస్తున్నారు. రష్మిక అన్ లిష్డ్ అనే ట్యాగ్ తో ఈ చిత్రాన్ని మొదలు పెడుతున్నారు ఇందులో రష్మిక కూడా చాలా కొత్త పాత్రలో కనిపించబోతోంది.


ఈరోజు ఉదయం తాజాగా ఈ చిత్రానికి సంబంధించి చిత్ర బృందం పోస్టర్ని కూడా రిలీజ్ చేసింది. పొదల మధ్యలో అగ్గితో తగలబడ్డ చెట్టు పక్కన ఒక నికార్సైన యాక్షన్ లుక్కులో హీరోయిన్ రష్మిక కనిపిస్తూ ఆమె చేతిలో ఒక ఆయుధం పట్టుకొని నిలబడి ఉన్న ఫోటో ఆమె వెనక జనం టార్చ్ లైట్ లు పట్టుకొని మరీ వెతుకుతూ ఉన్నట్లుగా ఈ పోస్టర్లో చూపించారు.. అలాగే ఈ పోస్టర్ కి హంటెడ్, వుండెడ్, అన్ బ్రోకెన్ అనే ట్యాగ్ లైన్ తో విడుదల చేశారు. పూర్తిగా ఇది హీరోయిన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా అన్నట్లుగా కనిపిస్తోంది.


రష్మిక ఈ పోస్టర్ని షేర్ చేస్తూ..  ఇంతవరకు తనని మీరు చూసింది వేరు.. ఒక ముద్దుగా నవ్వే అమ్మాయిని మాత్రమే చూశారు కానీ ఈసారి చూపించబోయేది రష్మిక పూర్తి భిన్నమైన యాంగిల్ అంటూ తెలియజేసింది. ఈ పాత్ర కోసం తాను కష్టపడి చేశానని.. ఒకవేళ ఈ సినిమా టైటిల్ కనుక గెస్ చేసి చెబితే వారిని కలుస్తా అంటూ తెలియజేసింది రష్మిక. రేపు ఉదయం 10:08 నిమిషాలకి టైటిల్,  ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించడం జరిగింది. ఈ చిత్రానికి సంబంధించి డైరెక్టర్ , నటీనటులకు సంబంధించి ఏ విషయమైనటువంటి అప్డేట్ తెలియజేయలేదు. మరి రేపు ఉదయం అన్నిటికి సమాధానం లభిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: