మంచు విష్ణు కలల ప్రాజెక్టుగా కన్నప్ప భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది .. హిందీలో మహాభారతం సీరియల్ తో మంచి పేరు తెచ్చుకున్న ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్లో కన్నప్ప సినిమాను మోహన్ బాబు సొంతంగా నిర్మించారు .. అలాగే మలయాళ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ బాడా హీరో అక్షయ్ కుమార్ .. పాన్ ఇండియ‌ హీరో ప్రభాస్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయి లో ఊహించని రేంజ్ లో రిలీజ్ చేయగా .. ప్రీమియర్స్ నుంచి మంచి టాక్ ని తెచ్చుకుంది ..


ముఖ్యంగా ఈ సినిమా లో కోలీవుడ్ నటుడు శరత్ కుమార్ ..  కన్నప్ప తండ్రిగా నాథనాధుడి క్యారెక్టర్ లో గంభీరమైన వాయిస్ తో అదరగొట్టాడు . అలాగే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనదైన విలక్షణ నటన తో డైలాగ్ డెలివరీతో అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో మహాదేవ శాస్త్రిగా మరోసారి అదరగొట్టాడు .. అలాగే హీరోయిన్ ప్రీతి ముకుందన్ ఛాలెంజింగ్ పాత్రలో ఒదిగిపోయింది. .. ఈ సినిమాలో మరి ముఖ్యంగా చెప్పవలసిన పాత్ర పాన్ ఇండియా హీరో ప్రభాస్ .. సినిమాలో కీలకమైన 40 నిమిషాల ఎపిసోడ్ ను ప్రభాస్ తన నటనతో నిలబెట్టేశాడు .. ప్రభాస్ డైలాగ్స్ విషయం లో రైటర్లు పెన్నకు పదునుపెట్టి మరి రాశారు .  ప్రభాస్ పెళ్లి డైలాగ్ కు థియేటర్స్ ఒక్కసారిగా మారు మోగిపోతాయి ..


అలాగే క్లైమాక్స్ లో మంచు విష్ణు నటన తన కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అనే టాక్ కూడా వచ్చింది .. శివయ్యకు తన కన్ను దానం చేసే సన్నివేశం సినిమాకే మెయిన్ హైలెట్గా నిలుస్తుంది .. ఇలా మొత్తానికి తన అద్భుతమైన నటన తో మంచు విష్ణు ప్రేక్షకులకు తన నటనతో కన్నీళ్లు తెప్పించారు .. అలాగే ఈ సినిమా కథను నమ్మి ఇంత భారీ స్థాయి లో నిర్మించిన మోహన్ బాబు , విష్ణు ను మెచ్చుకొని తీరాలి .. అలాగే సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ , గ్రాఫిక్స్ కూడా మెచ్చుకోదగ్గ స్థాయి లో సినిమాను నిలబెట్టాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: