ఇండియా వ్యాప్తంగా బిగ్బాస్ టెలివిజన్ షో కు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. మొదట ఇండియాలో బిగ్ బాస్ టెలివిజన్ కార్యక్రమం హిందీ భాషలో ప్రారంభం అయింది. దానికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి వచ్చింది. దానితో బిగ్ బాస్ కార్యక్రమాన్ని ఇండియా వ్యాప్తంగా పలు ప్రాంతీయ భాషలలో కూడా మొదలు పెట్టారు. అందులో భాగంగా కొన్ని సంవత్సరాల క్రితమే తెలుగు భాషలో కూడా బిగ్ బాస్ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఇప్పటికే తెలుగులో బిగ్ బాస్ కార్యక్రమం బుల్లి తెర పై 8 సీజన్లను కంప్లీట్ చేసుకోగా , ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో ఒక సీజన్ ను కంప్లీట్ చేసుకుంది.

ఇది ఇలా ఉంటే మరికొన్ని రోజుల్లోనే బిగ్ బాస్ బుల్లితెర 9 వ సీజన్ ప్రారంభం కానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. దానితో బిగ్ బాస్ అభిమానులు ఎప్పటి నుండి ఈ షో ప్రారంభం అవుతుందా ..? అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. బిగ్ బాస్ లోకి ఎక్కువ శాతం సెలబ్రిటీలు వెళుతూ ఉంటారు. దానితో సామాన్య జనాలు బిగ్ బాస్ లోకి వెళ్ళాలి అనుకున్నా కూడా ఏం చేయాలో తెలియక సైలెంట్ గా ఉండిపోతారు. అలాంటి వారి కోసం బిగ్ బాస్ బృందం వారు తాజాగా సూపర్ అప్డేట్ ను ఇచ్చారు. అసలు విషయం లోకి వెళితే ... తాజాగా బిగ్ బాస్ యాజమాన్యం బిగ్బాస్ షో లోకి వెళ్ళాలి అనుకునే సామాన్య ఆడియన్స్ కు సూపర్ ఆఫర్ ఇచ్చింది.

మామూలు ఆడియన్స్ కూడా బిగ్ బాస్ సీజన్ 9 లో కంటెస్టెంట్లు కావచ్చు అని తెలిపింది. అందుకు www.bb9.jiostar.com లోకి లాగిన్ అయ్యి మీరు ఎందుకు బిగ్ బాస్ షో లోకి వెళ్లాలి అనుకుంటున్నారు అనేది వివరిస్తూ ఓ వీడియో అప్లోడ్ చేయాలి అని కోరింది. అందులో సెలెక్ట్ అయిన వారిని బిగ్ బాస్ 9 లోకి తీసుకోబోతున్నట్లు బిగ్ బాస్ బృందం తాజాగా ప్రకటించింది. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 9 కు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించ బోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: