
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సినిమా ‘ హరిహర వీరమల్లు ’ ఈ సినిమా దాదాపుగా ఐదేళ్ల పాటు షూటింగ్ జరుగుతూ వస్తోంది. ఇప్పటికే పలుమార్లు రిలీజ్ డేట్ ప్రకటించాక కూడా వాయిదాలు పడుతూ వస్తోంది. ఈ సినిమా ట్రైలర్ ను ఈ నెల 3వ తేదీ ఉదయం 11.10 గంటలకు గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను ఈ నెల 24న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం నటిస్తోన్న భారీ పాన్ ఇండియా సినిమా గా హరిహర వీరమల్లు సినిమా నిలుస్తోంది. ఇక ఈ సినిమా ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తి తో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ను ఏపీలో పలు థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ రిలీజ్ చేసేందుకు ఏపీలో ఏకంగా 29 థియేటర్ల తో లిస్ట్ రెడీ చేశారు. ఈ 29 థియేటర్ల లో ముందుగా ట్రైలర్ రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఇక అభిమానులకు ఈ ట్రైలర్ కన్నుల పండువగా ఉంటుందని తెలుస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ను థియేటర్లలో చూస్తేనే ఆ థ్రిల్ వేరుగా ఉంటుందని మేకర్స్ ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రైలర్ ప్రేక్షకుల అంచనాలకు తగ్గకుండా ఉంటుందని చిత్ర యూనిట్ చెపుతోంది. ఈ సినిమాలో అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తుండగా క్రిష్, జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తుండగా ఏ.ఎం.రత్నం అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు