సినిమా ఇండస్ట్రీ లో కొంత మందికి ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ ఈమేజ్ వస్తూ ఉంటుంది. అలాంటి వారు అదే ఈమేజ్ను కంటిన్యూ చేయాలి అంటే ఆ తర్వాత కూడా వారికి అదే రేంజ్ విజయాలు, అంతకుమించిన విజయాలు దక్కుతూ ఉండాలి. అలా దక్కినట్లయితే వారు ఇండస్ట్రీలో చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్ స్టేటస్లో కొనసాగుతూ ఉంటారు. ఇకపోతే ఓ బ్యూటీ కెరియర్ ప్రారంభంలో అపజయాలను అందుకున్న ఆ తర్వాత సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకొని ఓవర్ నైట్ లో అద్భుతమైన గుర్తింపును దక్కించుకుంది. కానీ ఆ తర్వాత ఆమెకు ఆ స్థాయి విజయాలు దక్కలేదు. దానితో ప్రస్తుతం ఈమె చేతిలో సినిమాలు లేకుండా పోయాయి.

ఇంతకు ఓవర్ నైట్ లో స్టార్ ఈమేజ్ను దక్కించుకున్న ఆ డ్యూటీ ఎవరు అనుకుంటున్నారా..? ఆమె మరెవరో కాదు. మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని నేహా శెట్టి. ఈమె ఆకాష్ పూరి హీరోగా రూపొందిన మెహబూబ అనే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమా తర్వాత ఈమె నటించిన డీజే టిల్లు మూవీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇందులో తన నటనతో, అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ మూవీతో ఈమెకు ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ ఈమేజ్ వచ్చింది. ఆ తర్వాత ఈమె పలు సినిమాలలో నటించింది. అందులో బెదురులంక 2012 మూవీ పరవాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది.

కానీ ఈమెకు ఆ తరువాత పెద్ద స్థాయి విజయాలు దక్కలేదు. దానితో ప్రస్తుతం ఈమె చేతిలో సినిమాలు కూడా లేకుండా పోయాయి. సినిమాల ద్వారా కాకపోయినా ఈమె సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అభిమానులతో అనేక విషయాలు పంచుకుంటుంది. అలాగే అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వస్తుంది. ఈమెకు సంబంధించిన అనేక హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సూపర్ గా వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ns