
కోర్టు సినిమా విడుదలైన కేవలం రెండు రోజులకే బ్రేక్ ఈవెంట్ కూడా సాధించింది. ముఖ్యంగా హీరో శివాజీ పోషించిన ఇందులో మంగపతి పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా కావడంతో తనకి తదుపరి చిత్రాలలో కూడా అవకాశాలను వచ్చేలా చేసింది. తాజాగా ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా కొన్న బయ్యర్లకు ఏ విధంగా లాభాలను తెచ్చిపెట్టిందో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.
1). నైజాం ఏరియాలో - 9.25 కోట్లు
2). సీడెడ్ -1.72 కోట్లు
3). ఆంధ్రాలో మొత్తం కలెక్షన్స్-7.6 కోట్లు
4). ఏపీ తెలంగాణ మొత్తం కలెక్షన్స్-18.57 కోట్లు
5). రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ కలెక్షన్స్-6.5 కోట్లు
6). ప్రపంచవ్యాప్తంగా టోటల్ కలెక్షన్స్ విషయానికి వస్తే.-25.07 కొట్లు.
కోర్టు సినిమా కేవలం 7 కోట్ల రూపాయలతో థియేట్రికల్ బిజినెస్ అవ్వగా.. కోర్టు సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే 7.5 కోట్ల రూపాయలు రాబట్టాల్సి ఉంటుంది. అయితే ఈ కలెక్షన్స్ ని కేవలం రెండు రోజుల్లో పై బ్రేక్ ఈవెన్ సాధించడంతోపాటుగా 25.07 కోట్ల రూపాయలు షేర్ ను రాబట్టడంతో గ్రాస్ పరంగా చూసుకుంటే 46 కోట్ల రూపాయలకు పైగా రాబట్టినట్లు తెలుస్తోంది. దీంతో బయ్యర్లకు ఈ సినిమా ఏకంగా రూ.17 .5 కోట్ల రూపాయల వరకు ప్రాపర్టీని అందించి పెట్టిన పెట్టుబడి కంటే డబుల్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది.