పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా హరిహర వీరమల్లు అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా ... జ్యోతి కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఎం ఎం కీరవాణి సంగీతం అందించిన ఈ మూవీ ని ఏ ఏం రత్నం అత్యంత భారీ బడ్జెట్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఈ మూవీ షూటింగ్ చాలా కాలం క్రితం స్టార్ట్ అయింది. కానీ అనువార్య కారణాల వల్ల ఈ మూవీ షూటింగ్ కొంత కాలం పాటు ఆగిపోయింది. దానితో ఈ మూవీ డిలే అయింది.

కొంత.కాలం క్రితం ఈ సినిమాను జూన్ 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకప్ ప్రకటించారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఆ సమయంలో ఈ మూవీ కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తిరుపతి లో నిర్వహించనున్నట్లు కూడా మేకర్స్ ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడడంతో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా వాయిదా పడింది. ఇకపోతే కొంత కాలం క్రితమే ఈ సినిమాను జూలై 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు జూలై 19 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను తిరుపతి లో నిర్వహించాలి అనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఇక గతంలో తిరుపతిలో నిర్వహించాలి అనుకున్న ఫ్రీ రిలీజ్  ఈవెంట్ క్యాన్సల్ కావడంతో అక్కడే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలి అని మేకర్స్ డిసైడ్ అయినట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లో రాబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ప్రస్తుతానికి పవన్ అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకులు కూడా హరిహర వీరమల్లు సినిమాపై మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: