
ఈ సినిమాలో అమీర్ ఖాన్ నటిస్తున్నప్పటికీ అమీర్ కు తనకు మధ్య ఎలాంటి సీన్స్ ఉండవని నాగ్ అన్నారు. ఈ సినిమాలోని అమీర్ ఖాన్ పాత్ర కచ్చితంగా థ్రిల్ పంచుతుందని ఆయన చెప్పుకొచ్చారు. మేమిద్దరం ఒకే సీన్ లో కనిపించమని ఆయన తెలిపారు. సినిమాలో మా చాఫ్టర్లు వేర్వేరుగా ఉంటాయని ఆయన నటించిన కొన్ని సీన్స్ చూశానని నిజంగా అద్భుతం అని కొత్త అమీర్ ఖాన్ ను చూస్తారని చెప్పుకొచ్చారు.
ఈ సినిమాలో ఇతర భాషలకు సంబంధించిన కీలక నటులు సైతం నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ లో పూజా హెగ్డే నటించారు. బిజినెస్ పరంగా సంచలనాలు సృష్టించిన కూలీ కలెక్షన్ల విషయంలో ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చుఁ.
ఈ సినిమాలో రజనీకాంత్ దేవా పాత్రలో కనిపించనున్నారు. వార్2, కూలి పోటీలో ఏ సినిమా పైచేయి సాధిస్తుందో చూడాల్సి ఉంది. కూలి సినిమాలో ఆసక్తికర ట్విస్టులు ఉండనున్నాయని సమాచారం అందుతోంది. కూలి సినిమా ఏ స్థాయిలో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. కూలీ సినిమా ఇతర భాషల్లో ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. కూలీ సినిమా 1000 కోట్ల రూపాయల బొమ్మ కావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.