- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ఈనెల 24న రాబోతుంది. ఈ సినిమాకు తొలి నుంచి అవాంతరాలు ఎదురవుతున్నాయి. మొన్న థియేటర్లు విషయం కూడా ఈ సినిమాను కుదిపేసింది. గత నెల 12న రిలీజ్ కావాల్సిన సినిమా మరోసారి వాయిదా పడింది. ఈనెల 24న థియేటర్లోకి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ వీరమల్లుకు మ‌ళ్లీ చిక్కు వచ్చి పడింది. వీరమల్లు వచ్చిన వారం రోజులకే విజయ్ దేవరకొండ కింగ్డమ్ రిలీజ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమా వస్తుందంటే కనీసం రెండు వారాల వ్యవధి అవసరం. మళ్లీ కావాలని వీరమల్లు సినిమాను టార్గెట్ చేస్తున్నారా ? అన్న సందేహాలు కనిపిస్తున్నాయి. వీరమల్లు బడ్జెట్ వేరు .. బిజినెస్ వేరు నిర్మాత ఈ సినిమాకు భారీ రేట్లు చెబుతున్నారు. అంత రిస్కు చేసి సినిమాకు కొన్న బయ్యర్లకు ఆ డబ్బులు రావాలంటే రెండో వారం కూడా స్పేస్ రావాలి.


వీరమల్లు బిజినెస్ దాదాపు క్లోజింగ్ స్టేజ్ కి వచ్చేసింది. అగ్రిమెంట్లు జరగలేదు. ఇప్పుడు కింగ్డమ్ డేట్ ప్రకటించడంతో వీరమల్లు బయ్యర్లు డైలమాలో పడే అవకాశం ఉంది. పవన్ కంటే విజయ్ దేవరకొండ చిన్న హీరో.. కానీ కింగ్డమ్ సినిమా మీద క్రేజ్ ఏర్పడింది. పైగా వీర‌మ‌ల్లు చూసే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావాలంటే రెండో వారంలోనే కుదురుతుంది. అందుకే ఇప్పుడు వీరమల్లు స్పీడ్ కు విజయ్ దేవరకొండ కింగ్డమ్ బ్రేకులు వేసినట్టే కనిపిస్తోంది. సినిమాకు ఎంత సూపర్ హిట్ టాక్ వచ్చిన రెండో వారంలో బీ - సీ సెంటర్లో కొన్ని థియేటర్లు ఖాళీ చేసి విజయ్ దేవరకొండ సినిమాకు ఇవ్వాల్సి ఉంటుంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ వీరమల్లు సినిమాకు ఎప్పుడు ఏదో ఒక అవాంతరం కనిపిస్తూనే ఉంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: