- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు ఈనెల 24న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోంది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో తొలిసారి పీరియాడికల్ సినిమాగా తరకెక్కిన వీరమల్లు పాన్ ఇండియా వైస్ గా రిలీజ్ అవుతుంది. గ‌త నాలుగేళ్లు గా షూటింగ్ జరుపుకుంటూ వస్తున్న ఈ సినిమా ఎన్నో అవాంతరాలు దాటుకుని ఎట్టకేలకు ఈనెల 24న రిలీజ్ అవుతుంది. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా మొగలుల కాలంనాటి పీరియాడికల్ స్టోరీ తో తెర‌కెక్కింది. మెగా సూర్యా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత ఏం రత్నం నిర్మించిన ఈ సినిమాకు క్రిష్ - ఏఎం. జ్యోతి కృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా రన్ టైం వైరల్ గా మారింది.


అఫీషియల్ గా ఈ సినిమా రన్ టైం ఎంత అన్నది మేకర్స్ ప్రకటించకపోయిన ఓవర్సీస్ లో కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే ఫ్రీ బుకింగ్ స్టార్ట్ అయ్యాయి.
ఈ క్రమంలోనే ఓ విదేశీ వెబ్సైట్ వీరమల్లు సినిమా రన్ టైం 2.40 గంటలు అని పేర్కొంది. అంటే వీరమల్లు సినిమా మొత్తం 160 నిమిషాల పాటు ఉంటుందని క్లారిటీ వచ్చేసింది. ఇటీవల కాలంలో పెద్ద సినిమాలకు కాస్త ఎక్కువగానే రన్ టైం ఉంటుంది. వీర‌మ‌ల్లు సినిమాకు మంచి టాక్ వస్తే ఈ ర‌న్‌ టైం సినిమా చూసే ప్రేక్షకుడికి పెద్ద ఇబ్బంది కాదనే చెప్పాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: