పవన్ కళ్యాణ్ .. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ పేరే మారుమ్రోగిపోతుంది.  త్వరలోనే "హరిహర వీరమల్లు" సినిమాతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి రెడీగా ఉన్నాడు . ప్రెసెంట్ పవన్ కళ్యాణ్ ఫొటోస్ అదేవిధంగా హరిహరవీరమల్లు మూవీ అప్డేట్ సోషల్ మీడియా విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి . పవన్ కళ్యాణ్ ని చూడాలి అని పవన్ కళ్యాణ్ పక్కన్న నిల్చొని ఫోటో తీయ్యించుకోవాలి అని చాలామందికి ఉంటుంది . కానీ ఆ అదృష్టం అందరికి రాదు . ఒకవేళ అదృష్టం వస్తే మాత్రం కచ్చితంగా ఫ్యాన్ ఆ ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటారు.
 

అది ఎంత పెద్ద స్టార్ అయినా సరే.  తాజాగా అలాగే చేశాడు జ్యోతి కృష్ణ . హరి హర వీరమల్లు  సినిమా డైరెక్టర్. తాజాగా ఆయన ఓ బ్యూటిఫుల్ మూమెంట్ ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.  ఇది ఒక "ప్రొఫెషనల్ మెమొరీ కాదు లైఫ్ టైం మెమొరీ " అంటూ తన భార్యతో తన కూతురితో అలాగే తన తండ్రితో ఇంకా సినిమా నిర్మాత అయిన ఏ ఎం తర్నం..పవన్ కళ్యాణ్ తో కలిసి పవన్ కళ్యాణ్ తో ఒక పిక్చర్ తీసుకున్నారు . ఆ పిక్చర్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.

 

జ్యోతి కృష్ణ కూతురు ఆహనాని పవన్  కళ్యాణ్ ఎత్తుకోగా ..నేడు తన  చిన్నారి పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని తాను అభిమానులతో పంచుకొని ఆనందం వ్యక్తం చేశాడు. దీంతో ఈ పిక్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఈ జూలై 24న గ్రాండ్గా ధియేటర్స్ లో పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాతో ఇంకా ఆయన పేరు మారుమ్రోగిపోతుంది  అంటూ జ్యోతి కృష్ణ ధీమా వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన అప్డేట్స్ అన్ని కూడా సినిమా పై హైప్ పెంచేశాయి. చూడాలి మరి "హరిహర వీరమల్లు" సినిమా ఎలా ఉంటుందో..?? ఎలాంటి కలెక్షన్స్ కలెక్ట్ చేస్తుందో..??



మరింత సమాచారం తెలుసుకోండి: