"బాహుబలి" ఇది ఒక సినిమా పేరు కాదు ఒక ఎమోషన్ . అసలు ఇలాంటి సినిమాలు తెలుగు జనాలు ఆదరిస్తారా..? అని ఎంతో మందికి డౌట్లు ఉండేటివి.  గతంలో ఏ డైరెక్టర్ కూడా ఇలాంటి సినిమాలు తెరకెక్కించడానికి ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు కాదు . తెలుగు ఆడియన్స్ అంటే ఫ్యామిలీ సెంటిమెంట్ లేదా.. లవ్ స్టోరీ ఇదే విధంగా అనుకునేవారు . మహా అయితే తొడ కొట్టే సీన్స్.. ఇలాంటి సినిమాలు చూస్తారు అని అనుకునేవారు.  ఒక ప్రెస్టీజియస్ కథను ఎప్పుడూ ఎంకరేజ్ చేయరు అనే భ్రమలో ఉండేవారు . కానీ జనాలు అలా లేరు అంటూ ప్రూవ్ చేశాడు రాజమౌళి .

"బాహుబలి" సినిమాతో తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు తెలియజేశారు.  బాహుబలి చిత్రం విడుదలై దశాబ్దం రోజులు పూర్తిచేసుకుంది.  తొలిభాగం 2015జూలై 10న విడుదలై భారతీయ సినీ చరిత్రలోనే సెన్సేషనల్ రికార్డ్ సృష్టించింది . ఆ తర్వాత 2017 పార్ట్ 2 రిలీజ్ అయ్యి వేరే లెవల్ రికార్డ్స్ క్రియేట్ చేసింది . బాహుబలి గా ప్రభాస్ భళ్ళాల దేవుడి గా రానా.. దేవసేన గా అనుష్క.. శివగామిగా రమ్యకృష్ణ.. అవంతిక గా తమన్నా .. కట్టప్ప గా సత్యరాజ్  ఈ చిత్రాలలో ముఖ్య పాత్రలు పోషించి సినిమాని వేరే లెవెల్ లోకి తీసుకెళ్లారు.

కాగా ఈ సినిమాకి పార్ట్ 3 రావాలి అంటూ ఎప్పటినుంచో ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. అలా వస్తేనే ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డ్స్ మళ్ళీ బాహుబలి 3 బద్దలు కొడుతుంది అంటూ ఆశ పడుతున్నారు . కాగా దీనిపై రీసెంట్గా రాజమౌళి స్పందించారు . "మీ అందరి కోసం మరోసారి బాహుబలి థియేటర్లో సందడి చేయనుంది. బాహుబలి తో రెండు భాగాలుగా కలిపి ఓ సినిమాను రిలీజ్ చేయనున్నాం. అక్టోబర్ 31న ప్రేక్షకులు ముందుకు ఈ సినిమా రాబోతుంది "అంటూ రాజమౌళి ట్విట్టర్ వేదికగా అనౌన్స్ చేశారు. బాహుబలి ది ఎపిక్ పేరుతో ఈ ప్రత్యేక మైలురాణి గుర్తు చేసుకుంటాం అంటూ ఈ మెసేజ్ ని అభిమానులు ఫార్వర్డ్ చేస్తున్నారు . ఇది నిజంగా రాజమౌళి అభిమానులకు ఇచ్చిన బిగ్ సర్ప్రైజ్ అంటున్నారు సినీ మేకర్స్. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు రానా అభిమానులు అనుష్క అభిమానులకు ఇది పండుగ చేసుకునే మూమెంట్. కాగా ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కధ అందించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: