జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి సంబంధించిన ఏ అప్డేట్ రిలీజ్ అయినా సరే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హడావుడి మాములుగా ఉండదు. రచ్చ రంబోలా చేసేస్తూ ఉంటారు నందమూరి అభిమానులు. మరీ ముఖ్యంగా ఆయన నటించిన వార్ 2 సినిమా ఆగస్టు 14వ తేదీ గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ పనులను మరి కొద్ది రోజుల్లోనే స్టార్ట్ చేయబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది . కాగా ప్రజెంట్ జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా షూట్ పనుల్లో బిజీ బిజీగా ఉన్నాడు .


ఈ సినిమాలో హీరోయిన్ రుక్మిణి వసంత్ కన్ఫామ్ అయిన విషయం అందరికీ తెలిసిందే . కాగా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ రోల్ కోసం మరొక స్టార్ హీరోయిన్ చూస్ చేసుకున్నాడు ప్రశాంత నీల్ అన్న వార్త ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది. ప్రశాంత్ నీల్ కాల్ షీట్స్ బిజీగా ఉన్న హీరోయిన్స్ ని అస్సలు చూస్ చేసుకోరు. ఆ విషయం అందరికీ తెలిసిందే . ఆయన కమిట్మెంట్ షెడ్యూల్ అంత వేరే విధంగా ఉంటుంది . చాలా పీస్ ఫుల్ గా ప్రశాంతంగా కాల్ షీట్స్ ఇచ్చే హీరోయిన్ లని ఆయన సినిమాలకి చూస్ చేసుకుంటూ ఉంటారు .


"కేజీఎఫ్" విషయంలో అలానే లెక్కలు వేసుకుని మరీ శ్రీనిధి శెట్టి కి ఛాన్స్ ఇచ్చాడు. కాగా ఈ మూవీతో శ్రీనిధి శెట్టి అదేవిధంగా ప్రశాంత్ నీల్ మధ్య ఫ్రెండ్షిప్ బాగా పెరిగిపోయింది . ఈ క్రమంలోనే వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ బాండింగ్ తో ఆయన శ్రీనిధి శెట్టికి మరో అవకాశం ఇచ్చినట్లు కన్నడ మీడియా చెప్తుంది . కన్నడ ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే న్యూస్ ఇంట్రెస్టింగ్ ట్రెండ్ అవుతుంది.  ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కే సినిమాలో మొదటి హీరోయిన్ గా రుక్మిణి వసంత్ ను తీసుకున్న డైరెక్టర్ ఇప్పుడు సెకండ్ హీరోయిన్ గా శ్రీ నిధి శెట్టిని చూస్ చేసుకున్నారు అన్న వార్త ట్రెండ్ అవుతుంది.


శ్రీనిధి శెట్టి క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది అంటూ కూడా ఓ న్యూస్ బయటకి వచ్చింది.  కే జి ఎఫ్ సినిమాకి క్వైట్ ఆపోజిట్ రోల్లో ఈ సినిమాలో ఎన్టీఆర్ తో నటించబోతుందట  శ్రీనిధి శెట్టి. రీసెంట్ గానే హిట్ 3 సినిమాలో తన పర్ఫామెన్స్ చూపించి తెలుగు అభిమానుల చేత శభాష్ అని ప్రశంసలు దక్కించుకునేలా చేసుకుంది. శ్రీనిధి శెట్టి . ఇప్పుడు ఎన్టీఆర్ లాంటి హీరోతో ఛాన్స్ కొట్టేసింది . ఇక అమ్మడు కాల్ షీట్స్ అన్ని ఫుల్ అయిపోవడం ఖాయం అంటున్న సినీ ప్రముఖులు.  అంతేకాదు ఎన్టీఆర్-  ప్రశాంత్ నీల్ హీరోయిన్స్ విషయంలో తీసుకునే నిర్ణయం చాలా బాగుంది అంటూ పొగిడేస్తున్నారు. చూడాలి మరి శ్రీనిధి-తారక్ ల జోడి తెర పై ఎంత వరకు ఆకట్టుకుంటుందో..???

మరింత సమాచారం తెలుసుకోండి: