
వరుణ్ వెకేషన్ కి సంబంధించిన పిక్చర్స్ కూడా బయటకు వచ్చాయి . ఆ పిక్చర్స్లో వరుణ్ తేజ్ ఎప్పటిలాగే చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. కాగా ఆ పిక్చర్స్ పై రకరకాల నోట్ కూడా రాసుకోవచ్చాడు వరుణ్ తేజ్ . ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ కి సంబంధించిన ఒక ఫోటో బాగా ట్రెండ్ అవుతుంది. వరుణ్ తేజ్ చాయ్ మిక్స్ చేస్తూ నవ్వుతున్న ఫోటో పై ఒక నోట్ రాసుకొచ్చారు. "ఆ రూమర్ ఇప్పటికీ నేను వింటే పగలబడి నవ్వుతాను " అనే విధంగా ఇంగ్లీషులో రాసుకోచ్చారు. దానికి తగ్గట్టే ఆ ఫోటోలో నవ్వుతూ వరుణ్ తేజ్ ఉండడం కూడా హైలెట్ గా మారింది.
దీంతో సోషల్ మీడియాలో వరుణ్ తేజ్ ని అంత బాగా నవ్వించిన ఆ బిగ్ రూమర్ ఏంటి..? అంటూ తెగ మాట్లాడుకుంటున్నారు . ఈ మధ్యకాలంలో వరుణ్ తేజ్ పై ఎక్కువగా వినిపించిన రూమర్ ఏదైన ఉంది అంటే మాత్రం ఆయనకి కొడుకు పుట్టాడు అని. లావణ్య త్రిపాఠికి ఇంకా డెలివరీనే కాలేదు. అప్పుడే కొడుకా..? కూతురా ..?? అని ఎలా తెలుస్తుంది అంటూ చాలామంది మెగా ఫాన్స్ ఫైర్ అయ్యారు . మే బి ఇదే బిగ్ రూమర్ అని ..అది విని నవ్వుకుంటున్నారేమో అంటూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు . కానీ వరుణ్ తేజ్ చాలా హ్యాపీగా ఆనందంగా ఉండడం చూసి మెగా ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఉన్నారు. మీకు లైఫ్ లో ఎప్పుడు హ్యాపీనెస్ ఇలానే ఉండాలి అంటూ బ్లెస్ చేస్తున్నారు. వరుణ్ తేజ్ పలు సినిమాలతో బిజీగా ముందుకు వెళ్తున్నాడు. అలానే ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేస్తూ భార్య కి కూడా స్పెషల్ టైం కేటాయిస్తున్నాడు..!!