తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరి అయినటువంటి సూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రస్తుతం కూలీ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ఈ మూవీ లో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అక్కినేని నాగార్జున ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. నాగార్జునమూవీ లో విలన్ పాత్రలో నటిస్తున్నాడు అని ఓ వార్త వైరల్ అవుతుంది. ఒక వేళ నిజం గానే నాగర్జున ఈ మూవీ లో విలన్ పాత్రలో కనక కనిపించినట్లయితే అదో బిగ్ సర్ప్రైజ్ అవుతుంది. ఎందుకు అంటే నాగర్జున ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో హీరోగా నటించాడు. ఈ మధ్య కాలం లోనే కొన్ని సినిమాల్లో కీలక పాత్రలలో ,ముఖ్య పాత్రలలో నటిస్తున్నాడు. ఒక వేళ నాగ్ విలన్ పాత్రలో కనుక కూలీలో నటిస్తే ఆయన మొట్ట మొదటి సారి ఈ పాత్రలో కనిపించినట్లు అవుతుంది.

మరి నాగార్జున ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడు అనేది చూడాలి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... లోకేష్ కనకరాజు ఈ సినిమా ప్రమోషన్ల విషయంలో ఓ డేరింగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఈ మధ్య కాలంలో ఏ సినిమా విడుదల అవుతున్న ఆ మూవీ ల విడుదలకు ముందు ట్రైలర్లను పెద్ద రేంజ్ లో విడుదల చేస్తూ ఉంటారు. ట్రైలర్లు కనుక బాగున్నట్లయితే సినిమాపై బజ్ కూడా పెరుగుతుంది. కానీ లోకేష్ మాత్రం కూలీ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను విడుదల చేయకుండా డైరెక్ట్ మూవీనే విడుదల చేయాలి అని ఆలోచనలో ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇదే కనుక నిజం అయితే సినిమాపై ఎక్కువ అంచనాలు పెరిగే అవకాశాలు ఉండవు అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. మరి కూలీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ విషయంలో ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: