
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 24 న రిలీజ్ కు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు వీరమల్లు సినిమాకు యు / ఏ సర్టిఫికెట్ జారీ చేశారు అని తెలుస్తోంది. అంటే వీరమల్లు 162 నిమిషాల పాటు తెరమీద విధ్వంసం చూపించబోతున్నారు. సెన్సార్ రిపోర్టు పవన్ అన్న అభిమానులను కృషి చేసేలా ఉంది. ఫస్ట్ ఆఫ్ చాలా బాగుందని ... ఇంటర్వెల్ బ్యాంగ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఫీస్ట్ లా ఉంటుందని తెలుస్తోంది. కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా వచ్చిందట. క్లైమాక్స్ కూడా ఎవరూ ఊహించిన విధంగా తెరకెక్కించారని అంటున్నారు. అయితే ఒక విషయంలో మాత్రం వీరమల్లు అందరిని నిరాశకు గురి చేయబోతున్నాడట.
దేవర సినిమా కూడా ఫస్ట్ పార్ట్ ఎండింగ్ అనుకున్నంతగా రాలేదన్న చర్చలు సినిమా రిలీజ్ అయిన రోజు వినిపించాయి. వీరమల్లు సినిమాలో కూడా తొలి భాగంలో కథ అసంపూర్తిగా ఉంటుందని .. ఈ విషయంలో ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారా ? అన్న సందేహాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇక వీరమల్లు ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తుందని చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత రిలీజ్ అవుతున్న తొలి సినిమా కావడంతో వీరమల్లు సినిమాపై ఏపీ - తెలంగాణతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ ప్రేమికులలో కనీ విని ఎరుగని రీతిలో అంచనాలు ఉన్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు