
ఈ సినిమా కథ, కథనం కోసం వర్క్ చేసింది కూడా క్రిష్ అనే సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ సైతం హరిహర వీరమల్లు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ దర్శకుడు క్రిష్ కు క్రెడిట్ ఇవ్వడం జరిగింది. దర్శకుడు క్రిష్ సైతం హరిహర వీరమల్లు సినిమా గురించి, పవన్ ప్రతిభ గురించి, ఏఎం రత్నం నిర్మాణ విలువల గురించి ప్రస్తావిస్తూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
హరిహర వీరమల్లు సినిమా కోసం జ్యోతికృష్ణ వర్క్ చేసినా వర్క్ చేసినా మేజర్ క్రెడిట్ మాత్రం క్రిష్ కే దక్కుతుందని చెప్పవచ్చు. హరిహర వీరమల్లు మూవీ పాన్ ఇండియా మూవీగా విడుదల కానుండగా ఇతర భాషల్లో ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేయాలనీ ఫ్యాన్స్ భావిస్తున్నారు. పవన్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ ఊహించని స్థాయిలో అంతకంతకు పెరుగుతోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాతో సులువుగానే 200 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు ఏ స్థాయిలో ఉంటాయో చూడాల్సి ఉంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఈ సినిమా సక్సెస్ విషయంలో టాక్ కీలకం కానుంది.