
ఇప్పటికే పలు థియేటర్స్ వద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హంగామా స్టార్ట్ అయిపోయింది . భారీ భారీ కటౌట్లతో .. ఫ్లెక్సీలతో.. జై పవన్ అంటూ నినాదాలతో హోరెత్తిపోతుంది. అంతేకాదు ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ నటించి రిలీజ్ అవుతున్న మొదటి సినిమా ఇదే కావడంతో అటు రాజకీయ నేతల్లోనూ ఈ సినిమా ఎలా ఉండబోతుంది అన్న టెన్షన్ మొదలైంది . కొన్ని చోట్ల హరిహర వీరమల్లు సినిమాకి నెగిటివ్ ట్రోల్లింగ్ కూడా జరుగుతుంది . కానీ మేకర్స్ దాన్ని ఏమి పట్టించుకోవడం లేదు. ఎవరో కావాలనే పవన్ కళ్యాణ్ అంటే పడని వాళ్ళు పొలిటికల్ పరంగా హేట్ చేస్తూ సినిమాలను దెబ్బతీయాలని చూస్తున్నారు అంటూ మాట్లాడుతున్నారు.
కాగా హరిహర వీరమల్లు సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ పవన్ కళ్యాణ్. ఆ తర్వాత బిగ్ ప్లస్ పాయింట్ టైటిల్ . ఆ టైటిల్ తోనే సగం హిట్ కొట్టేశారు డైరెక్టర్ . అయితే ఈ సినిమాకి ముందుగా మేకర్స్ అనుకున్న టైటిల్ "యోధుడు" అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . హరిహర వీరమల్లు సినిమాకి ముందుగా "యోధుడు" అనే టైటిల్ పెట్టాలనుకున్నారట . కానీ టైటిల్ లో క్రిస్పీనెస్ లేదు . జనాలను అట్రాక్ట్ చేసే అంత హైలెట్ ఎలిమెంట్స్ లేవు అని ఆలోచించి స్వయాన డైరెక్టర్ క్రిష్ ఈ మూవీకి "హరిహర వీరమల్లు" అంటూ టైటిల్ సజెస్ట్ చేశారట . దానికి పవన్ కళ్యాణ్ , అలాగే మూవీ మేకర్స్ ఓకే అనడంతో అదే ఫైనలైజ్ అయిపోయింది . ఇప్పుడు ఆ హరిహర వీరమల్లునే సినీ ఇండస్ట్రీ రికార్డ్స్ బ్లాస్ట్ చేసే రేంజ్ కి ఎదిగిపోబోతుంది అంటూ మాట్లాడుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. చూద్దాం మరి ఏం జరుగుతుందో..???