
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా సినిమా హరిహర వీరమల్లు తెలుగు సినీ ప్రియుల మనసును కొల్లగొట్టింది. శైవ హైందవ ధర్మాన్ని పరిరక్షించేందుకు తన ప్రాణాలను పణంగా పెట్టిన ఒక యోధుడి కథగా రూపొందిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర అత్యంత శక్తివంతంగా చూపించారు. దర్శకుడు క్రిష్ జగర్లమూడి సారథ్యంలో తెరకెక్కిన ఈ చారిత్రాత్మక యాక్షన్ డ్రామా ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. హరిహర వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ అద్భుతంగా ఒదిగిపోయారు. పవన్ నటన, డైలాగ్ డెలివరీ ఒక యోధుడి విలక్షణతను ప్రతిబింబించాయి. ప్రత్యేకించి యుద్ధ సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ చూపించిన ఎనర్జీ, స్కిల్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. సినిమాకి ప్రాణం పోసిన యాక్షన్ సీన్‌లు కూడా పవన్ స్వయంగా కంపోజ్ చేయడం విశేషం. ఈ సన్నివేశాలు సినిమా స్థాయిని మరో ముంత లోకి తీసుకెళ్లాయి.
వీరమల్లు కథ 17వ శతాబ్దపు మొఘల్ పరిపాలనలో అణగారిన హైందవ ధర్మాన్ని గౌరవంగా నిలబెట్టే ప్రయత్నంగా ఉండటం విశేషం. ఔరంగజేబ్ వంటి క్రూర పాలకుడికి ఎదురు నిలబడిన ధర్మయోధుడు హరిహర వీరమల్లు పాత్ర ద్వారా పవన్ కళ్యాణ్ మానవత్వానికి, ధర్మబద్ధతకు ప్రతీకగా నిలిచారు. కథ నడిపే విధానం, మ్యూజిక్, ఆర్ట్ డైరెక్షన్ అన్నీ కలసి సినిమాను విజువల్ గా ఓ గొప్ప అనుభూతిగా మార్చాయి. సినిమాలోని ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్లు ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెచ్చాయి. ఒక యోధుడు తన ధర్మాన్ని ఎలా నిలబెట్టుకున్నాడో, దాన్ని కాపాడటానికి ఎన్ని అడ్డంకులను దాటాడో అద్భుతంగా చూపించారు. ప్రత్యేకించి చివరి సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ అభినయం సినీ అభిమానుల్ని కళ్ళు తిప్పుకోలేని రీతిలో ఉంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు