కొన్ని కొన్ని సార్లు ఫ్యాన్స్ చేసే పని చాలా కోపం తెప్పిస్తాయి.  మరికొన్నిసార్లు చాలా ఫన్నీగా ఉంటాయి. నవ్వు తెప్పిస్తుంది.  అసలు ఒక సినిమా కోసం ఇంతలా వెయిట్ చేస్తూ ఉంటారా..? అనే క్వశ్చన్స్ కూడా మన మదిలో తట్టేలా చేస్తాయి . ప్రెసెంట్ ఇలాంటి కామెంట్స్ తోనే మహేష్ బాబు ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నారు . మన ఇండియన్ సినిమాని గ్రాఫిక్స్ పరంగా టెక్నాలజీ పరంగా హాలీవుడ్ సినిమాలతో పోటీ పడాలా చేసిన ఏకైక డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే మాత్రం అది కళ్ళు మూసుకొని చెప్పేసే పేరు రాజమౌళి . పదేళ్ల క్రితమే ఆ స్టాండర్డ్స్ సెట్ చేశాడు రాజమౌళి .


కాగా రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో ఒక సినిమా ని తెరకెక్కిస్తున్నారు . ఈ సినిమాతో వేరే లెవెల్ హిట్ తన ఖాతాలో వేసుకోబోతున్నాడు అంటూ అందరికీ అర్థం అయిపోయింది . హాలీవుడ్ అవతార్ స్థాయికి ఏమాత్రం తీసిపోదు ఈ సినిమా అనేది అసలు నిజం. ఆ రేంజ్ లోనే ఈ సినిమా కోసం కష్టపడుతున్నారు మూవీ టీం.  నిన్న మహేష్ బాబు పుట్టినరోజు ఈ సందర్భంగా ఆయన సినిమాకి సంబంధించి ఏదో ఒక బిగ్ అప్డేట్ వస్తుంది అంటూ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు . ఒక వీడియో వస్తుందని ఒక గ్లింప్స్ వస్తుంది అని చాలా వెయిట్ చేశారు .



కానీ రాజమౌళి ఒక సింపుల్ లుక్స్ తో మహేష్ బాబు బర్త్డ డే సెలబ్రేషన్స్ కంప్లీట్ చేసేసారు. అయితే ఫ్యాన్స్ మాత్రం అసలు ఊరుకోలేదు . రాజమౌళి అప్డేట్ ఇవ్వకపోతే మా హీరో సినిమాకి సంబంధించిన అప్డేట్ మేమే ఇచ్చుకుంటామంటూ ఒక స్పెషల్ వీడియోని క్రియేట్ చేశారు . ఏఐ యూస్ చేసి అద్దిరిపోయే రేంజ్ లో హై క్వాలిటీ స్టాండర్డ్స్ తో వీడియోని సెట్ చేసి రిలీజ్ చేశారు . మహేష్ బాబు రాజమౌళి మూవీ కి సంబంధించిన గ్లింప్స్ వీడియో ఇదే అంటూ ఒక అభిమాని తన సృజనాత్మకతను ఉపయోగించి వీడియోని విడుదల చేశారు .

 

ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది . మరీ ముఖ్యంగా ఈ వీడియోలోని క్వాలిటీ చూస్తే అసలు ఇది ఎడిట్ వీడియో అని అనిపించనే  అనిపించదు.  ఒరిజినల్ వీడియో లానే ఉంది . ఆ రేంజ్ లో ఉంది ఈ వీడియో . మరి ఇది మూవీ టీం వరకు చేరితే ఖచ్చితంగా రెస్పాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది.  చూడాలి మరి ఎంత వరకు ఈ వీడియో రీచ్ అవుతుంది అనేది . చాలామంది ఈ వీడియో రాజమౌళి వరకు రీచ్ అవ్వాలి అంటూ బాగా షేర్స్ చేస్తున్నారు.  బాగా ట్రెండ్ చేస్తున్నారు . ఈ వీడియో మాత్రం ఒక హై లెవెల్ లోనే క్రియేట్ చేశాడు ఆ అభిమాని అని చెప్పుకోవడంలో సందేహం లేదు . కాగా ఈ సినిమాలో ప్రియాంక చోప్రా - పృథ్వీరాజ్ సుకుమారన్ - మాధవన్ తదితరులు నటిస్తున్నారు. విలన్స్ గా ప్రియాంక చోప్రా - పృథ్వీరాజ్ చేస్తున్నట్లు టాక్ . అయితే ఇంకా హీరోయిన్ ఎవరు అనేది ఖరారు కాలేదు . నవంబర్ నెలలో హీరోయిన్ కి సంబంధించిన అప్డేట్ వస్తుంది అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది. చూద్దాం మరి ఏం జరుగుతుందో..??



మరింత సమాచారం తెలుసుకోండి: