కొన్నిసార్లు హీరోయిన్స్ మాట్లాడే మాటలు భలే ఫన్నీగా ఉంటాయి . మరి కొన్నిసార్లు అవి బాగా ట్రెండ్ అవుతూ ఉంటాయి. ప్రెసెంట్ రష్మిక మందన్నా  మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి . రష్మిక మందన్నా  ఒక నార్మల్ హీరోయిన్ కానే కాదు.  క్రేజీ హీరోయిన్ ..స్టార్ హీరోయిన్ ..పాన్ ఇండియా లెవెల్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది . రష్మిక మందన ఏం మాట్లాడినా సరే ఆచి తూచి  ఆలోచించి కరెక్ట్ గా మాట్లాడాలి. ఒకవేళ ఆమె ఏ చెడు ఉద్దేశం తో అలా మాట్లాడకపోయినా కొంతమంది ట్రోలర్స్ ..మీమర్‌స్ మాత్రం ఆమె మాట్లాడే మాటలను అలా మలిచేస్తారు.


 రీసెంట్గా రష్మిక మాట్లాడిన మాటలను ఆ విధంగానే ద్వంద అర్ధాలు వచ్చేలా సోషల్ మీడియాలో మీమ్‌స్ ట్రెండ్ చేస్తున్నారు . రీసెంట్ గానే కుబేర సినిమాతో బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ తన కథలో వేసుకున్న రష్మిక .. ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమాల వైపు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తుంది . తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు రష్మిక. ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ..."తన కెరీర్ గురించి తన ఎమోషనల్ పర్సనాలిటీ గురించి ఓపెన్ అప్ అయ్యారు.  నేను ఒక నటిని నా పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ వేరే వేరేగా ఉంటుంది . నన్ను తెరపై చూసినట్లు మీరు ఇంట్లో చూడలేరు. చాలా చాలా సింపుల్ గా ఉంటాను . ముఖ్యంగా చాలా ఎమోషనల్ పర్సన్ ని.  ప్రతిదాన్ని మనసుకు తీసుకుంటాను.  ఎక్కువగా ఏడ్చేస్తాను కానీ నా భావోద్వేగాలను బయటకు చూపించను" అంటూ రష్మిక ఎమోషనల్ గా స్పందించింది .

 

అంతేకాదు రష్మిక ఇంకా మాట్లాడుతూ.." నేను నా ఎమోషనల్ పర్సనాలిటీని బయటికి చూపించను . ఒకవేళ నేను అలా చూయిస్తే అది నా బలహీనత అనుకుంటారు.  లేకపోతే నేను కెమెరాల కోసమే అదంతా చేస్తున్నా అని అనుకుంటారు . మనం ఎంత నిజాయితీగా ఉంటే అంత వ్యతిరేకత మనపై వస్తుంది . నా ఎమోషన్స్ ని ఎప్పుడూ కూడా బయట చూపించకూడదు అంటూ డిసైడ్ అయ్యాను.  దీంతోపాటు నా చుట్టూ ఉండే నెగిటివిటితో ప్రభావం కాకుండా ఉండడానికి చాలా చాలా కష్టపడుతున్నాను" అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు మీమర్‌స్. రష్మిక మాట్లాడిన మాటలను ద్వంద అర్థం వచ్చేలా ఆమెను హ్యూజ్ రేంజ్ లో ట్రోల్లింగ్ కి గురి చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: