
ప్రస్తుతం దక్షిణాది సినీ పరిశ్రమలో అత్యంత భారీ హైప్ క్రియేట్ చేసి .. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న సినిమా “ కూలీ ”. సూపర్ స్టార్ రజినీకాంత్, మాస్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కలయికలో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్‌కు ముందే అంచనాలను ఆకాశమే హద్దుగా పెంచేసింది. రజినీ గత సినిమాల విజయాలతో పాటు, లోకేష్ సృష్టించిన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ( LCU ) బ్రాండ్ విలువ కూడా ఈ సినిమాపై అద్భుతమైన బజ్ ను క్రియేట్ చేశాయి. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో, బుకింగ్స్ ప్రారంభమైన మొదటి క్షణం నుంచి అన్ని భాషల్లోనూ సాలిడ్ రెస్పాన్స్ వస్తోంది. ప్రత్యేకంగా తమిళనాడులో, “ కూలీ ” కి అప్రతిహతమైన డిమాండ్ ఉండటంతో, టికెట్ కౌంటర్ల వద్దనే కాకుండా ఆన్‌లైన్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా రికార్డ్ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ నమోదవుతున్నాయి.
ప్రస్తుత ట్రెండ్ చూస్తే, డే 1 కలెక్షన్లలో “కూలీ” తమిళ సినీ చరిత్రలోనే రికార్డు స్థాయి ఓపెనర్ అవ్వడం ఖాయం అని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొదటి రోజు వసూళ్ల విషయానికి వస్తే, దేశీయ మార్కెట్‌లోనే సునాయాసంగా 100 కోట్ల గ్రాస్ అందుకోవడం “కూలీ”కి మంచినీళ్లు తాగినట్టుగా కనిపిస్తోంది. ఓవర్సీస్ మార్కెట్‌లో రజినీ క్రేజ్ అనేది ఎప్పటికీ టాప్ లెవెల్‌లో ఉండటంతో .. ఆ వసూళ్లు కూడా కలిపితే ఫస్ట్ డే కూలీ గ్రాస్ 150 కోట్లను మించి 160 కోట్ల వరకు చేరే అవకాశం ఉందని ట్రేడ్ టాక్ చెబుతోంది. ఈ లెక్కల ప్రకారం చూస్తే ప్రస్తుత తమిళ బిగ్గెస్ట్ గ్రాసర్ విజయ్ లియో రు. 160 కోట్ల గ్రాస్‌ను కూలీ బద్దలు కొడుతుందంటున్నారు. ఈ సినిమాకు కూడా డైరెక్టర్ లోకేష్ కనకరాజే కావడం విశేషం.