
వార్ 2 కూడా ఇలాంటి కోవాలోకి వస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని ఉన్నా, ఆమె పాత్ర మాత్రం హైలైట్ కాలేదు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఆమె పాత్రను గెస్ట్ రోల్‌లా ఉన్నట్టే అనిపించిందని, ఆమెకు సంబంధించిన సీన్లు ట్రిమ్ చేయడం వల్ల పాత్ర బలహీనంగా మారిందని కామెంట్ చేస్తున్నారు. మరి ఈ పాత్రలో కియారా కంటే ముందు ఎవరు అనుకున్నారో తెలుసా? అయాన్ ముఖర్జీ మొదట "అలియా భట్" ను ఈ పాత్రకు ఎంపిక చేశారట. అలియా-- అయాన్ మధ్య ఉన్న బంధం అందరికీ తెలిసిందే.
బ్రహ్మాస్త్ర సినిమాలో వీరి కాంబినేషన్ అదిరిపోయింది. అంతేకాదు, వీరిద్దరి మధ్య బాండింగ్ కూడా వేరే లెవెల్‌లో ఉంటుంది. అయితే అలియా భట్ మాత్రం ఈ పాత్రను సున్నితంగా రిజెక్ట్ చేసిందట. ఈ పాత్రకు తాను 100% న్యాయం చేయలేనేమో అన్న భయంతోనే ఈ నిర్ణయం తీసుకుందట. ఆ తర్వాత ఈ పాత్ర కోసం కృతి సనన్, శ్రద్ధ కపూర్ వంటి స్టార్ హీరోయిన్లను కూడా పరిశీలించారు. కానీ చివరికి అప్పటికే ట్రెండింగ్‌లో ఉన్న కియారా అద్వానీనే ఈ పాత్రకు పర్ఫెక్ట్ అనుకుని మేకర్స్ ఆమెను ఫైనల్ చేశారు. సినిమాలో ఆమెకు చాలా సీన్లు రాసినా, వాటిలో చాలా భాగాన్ని ఎడిటింగ్‌లో ట్రిమ్ చేయడం పెద్ద తప్పు అయింది. ఫలితంగా సినిమా విడుదలైన తర్వాత కూడా కియారా అద్వానీ గురించి పెద్దగా ఎవ్వరూ మాట్లాడుకోవడం లేదు.