ఇప్పటికే తెలుగులో బిగ్ బాస్ టెలివిజన్ షో కు సంబంధించిన 8 సీజన్లు కంప్లీట్ అయ్యాయి. ఈ 8 సీజన్లలో బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా ... రెండవ సీజన్కు న్యాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించాడు. ఆ తర్వాత మూడవ సీజన్ నుండి నాగార్జున బిగ్ బాస్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నాడు. ఇప్పటివరకు జరిగిన మూడవ సీజన్ నుండి ఎనిమిదవ సీజన్ వరకు నాగార్జున బిగ్ బాస్ టెలివిజన్ షో కి హోస్ట్ గా వ్యవహరించాడు. ఇక ఇప్పటివరకు తెలుగులో బిగ్ బాస్ ఓ టి టి సీజన్ ఒకటి కంప్లీట్ అయింది. దానికి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు.

ఇక మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కానున్న బిగ్ బాస్ 9 వ సీజన్ కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. ఇప్పటికే బిగ్ బాస్ 9 వ సీజన్ కు సంబంధించిన పలు ప్రోమోలను బిగ్ బాస్ బృందం విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. బిగ్ బాస్ సీజన్ 9 మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరు ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే దానిపై ప్రేక్షకుల్లో అత్యంత ఆసక్తి నెలకొంది. దానితో ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోయేది వీరే అంటూ అనేక మంది పేర్లు తెరపైకి వస్తున్నాయి. 

తాజాగా మరో ఇద్దరి పేర్లు వైరల్ గా మారాయి. ఆ ఇద్దరు మరెవరో కాదు ... ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సెన్సేషన్ గా మారిన దువ్వాడ శ్రీనివాస్ , దివ్వల మాధురి. వీరిద్దరూ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. వీరిద్దరూ కనుక బిగ్ బాస్ సీజన్ 9 లోకి ఎంట్రీ ఇచ్చినట్లయితే ఈ సీజన్ టిఆర్పి రేటింగ్ కూడా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: