తెలుగు లో అత్యంత ప్రజాతరణ పొందిన టీవీ షో లలో బిగ్ బాస్ టెలివిజన్ కార్యక్రమం ఒకటి. ఈ షో కు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉండడంతో ఈ టీవీ షో కు మంచి క్రేజ్ కలిగిన టాలీవుడ్ హీరోలు హోస్ట్ లుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు తెలుగు లో బిగ్ బాస్ బుల్లి తెరపై 8 సీజన్లను కంప్లీట్ చేసుకోగా , ఓ టీ టీ లో ఒక సీజన్ ను కంప్లీట్ చేసుకుంది. తెలుగులో బిగ్ బాస్ మొదటి సీజన్ కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహవరించగా రెండవ సీజన్ కి నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహారించాడు. బిగ్ బాస్ 3 వ సీజన్ నుండి ఇప్పటివరకు తెలుగులో జరిగిన అన్ని బిగ్ బాస్ సీజన్లకు నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నాడు.

మరికొన్ని రోజుల్లోనే బిగ్ బాస్ 9 వ సీజన్ ప్రారంభం కాబోతుంది. బిగ్ బాస్ 9 వ సీజన్ కు కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. మరికొన్ని రోజుల్లోనే బిగ్ బాస్ 9 వ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సారి హౌస్ లోకి వీరు ఎంట్రీ ఇవ్వనున్నారు ..? వారు ఎంట్రీ ఇవ్వనున్నారు ..? అని అనేక మంది పేర్లు తెర పైకి వస్తున్నాయి. తాజాగా ఓ ముద్దుగుమ్మ పేరు తెగ వైరల్ అవుతుంది. 

ఆమె మరెవరో కాదు తెలుగులో సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత సినిమాల్లో కూడా అవకాశాలను దక్కించుకొని ప్రస్తుతం చాలా బిజీగా కెరియర్ను ముందుకు సాగిస్తున్న వారిలో ఒకరు అయినటువంటి నవ్య స్వామి. ఈమె బిగ్ బాస్ 9 లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. నవ్య స్వామి నటుడు అయినటువంటి రవి కృష్ణ తో ప్రేమలో ఉన్నట్లు అనేక వార్తలు వస్తున్నాయి. రవి కృష్ణ ఇప్పటికే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఈయన బిగ్ బాస్ విజేతగా నిలవలేదు. మరి నవ్య స్వామి బిగ్ బాస్ విజేతగా నిలుస్తుంది ఏమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: