సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాక కొంత మంది స్టార్ హీరోయిన్ స్థాయికి వెళతారు అని ప్రేక్షకులు భావించిన వారు ఉంటారు. కానీ వారు ఆ స్థాయికి వెళ్లకుండానే కెరియర్ను డౌన్ ఫాల్ చేసుకున్న వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో తెలుగమ్మాయి ఫరియా అబ్దుల్లా ఒకరు. ఈ ముద్దుగుమ్మ నవీన్ పోలిశెట్టి హీరో గా అనుదీప్ కే వీ దర్శకత్వం లో రూపొందిన జాతి రత్నాలు అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయింది. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో చిట్టి పాత్రలో నటించిన ఫరియా అబ్దుల్లా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.

సినిమా సూపర్ హిట్ కావడం , ఇందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా తర్వాత ఈమెకు వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కుతాయి అని , ఈమె చాలా తక్కువ కాలం లోనే తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంటుంది అని చాలా మంది భావించారు. కానీ ఆ తర్వాత ఈమెకు అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలలో ఎక్కువగా అవకాశాలు దక్కలేదు. ఈమెకు కొన్ని సినిమాలలో అవకాశాలు దక్కిన అవి అద్భుతమైన విజయాలను అందుకోలేదు. దానితో ఈమె కెరియర్ స్టార్ హీరోయిన్ స్థాయి వరకు వెళ్లలేదు. ఇకపోతే ప్రస్తుతం ఈమె పరవాలేదు అనే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలలో నటిస్తూ కెరియర్ను బాగానే ముందుకు సాగిస్తోంది. 

ఇకపోతే ఈమె సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు చాలా వరకు వైరల్ కూడా అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ బ్యూటీ వీలు చెప్పినప్పుడల్లా సినిమాల్లో కూడా అందాలను భారీగానే ఆరబోస్తూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: