రీసెంట్ గా మంచు లక్ష్మి తన దక్ష -ది డెడ్లీ కాన్సిరసీ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో జర్నలిస్టు విఎస్ఎన్ మూర్తి ఆమెను ఒక అడగకూడని ప్రశ్న అడిగారు.అదేంటంటే 50 ఏళ్ల వయసుకు దగ్గర పడుతున్నా కూడా ఎందుకు ఇలా ఒళ్ళు కనిపించేలా బట్టలు విప్పుకొని తిరుగుతూ అలాంటి బట్టలు వేసుకుంటున్నారు అని మాట్లాడారు. అయితే ఈ ప్రశ్న ఆడవాళ్ళను అడగకూడదు. అలాంటిది ఒక సెలబ్రిటీ నీ అడిగేసరికి ఆ హీరోయిన్ ఊరుకుంటుందా? ఇంటర్వ్యూలోనే జర్నలిస్టు విఎస్ఎన్ మూర్తికి ఇచ్చి పడేసింది.. నన్ను అడిగిన ఈ ప్రశ్న మహేష్ బాబుని అడగగలరా.. 50 ఏళ్లు వస్తే ఏంటి 100 ఏళ్ళు వస్తే ఏంటి..ఆయన 50 ఏళ్ళు ఉన్నారు.మీరు షట్ విప్పుకొని తిరగకండి అని చెప్పండి. ఇలాంటి ప్రశ్న నన్ను అడగడానికి మీకు ఎంత ధైర్యం.. హీరోలను అడిగే దమ్ము ధైర్యం లేదు.

కానీ ఆడవాళ్లను ఇలా చులకనగా చేసి మాట్లాడతారా..ఆడవాళ్లు అంటే ఎప్పుడూ వంటింటి కుందేళ్ల లాగే ఉండాలా.. అన్ని బాధ్యతలు మోస్తూ ఉండే ఆడవాళ్లకు ఫ్రీడమ్ ఉండదు.తమకు తాముగా నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉండదు. కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకొని బయటికి వస్తే ఇలా ఎవరో ఒకరు అడ్డుకట్ట వేస్తారు అంటూ జర్నలిస్టుపై మండిపడింది. ఇక అక్కడితో ఆగకుండా ఫిలిం ఛాంబర్ లో జర్నలిస్టు  విఎస్ఎన్ మూర్తి పై ఫిర్యాదు కూడా చేసింది. నా శరీరం గురించి,నా బట్టల గురించి, నా వయసు గురించి మాట్లాడే హక్కు ఆయనకు లేదు.అలాంటిది నా గురించి అంత బ్యాడ్ గా మాట్లాడిన మూర్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంచు లక్ష్మి ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేసింది. నాకు జర్నలిజం మీద చాలా గౌరవం ఉంది. నిజాలు బయటికి తీసి రాసే జర్నలిస్టులు మీద గౌరవం ఉంది.

కానీ ఇలా నన్ను అవమానించేలా..నా గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడితే అస్సలు ఊరుకోను. ఆయన సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం నా గురించి ఇలా చెత్త కామెంట్లు చేస్తే ఊరుకునేదే లేదు. అయితే మొదట ఈ మాటలు మాట్లాడినప్పుడు నేను సైలెంట్ గానే వాటిని ఎదుర్కొన్నాను. కానీ ఇలాంటి విషయాలపై మౌనం వహిస్తే ఇంకోసారి కూడా ఇలాంటి మాటలే మాట్లాడతారు. అందుకే చర్యలు తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఇండస్ట్రీలో ఉండకూడదు. సినీ ఇండస్ట్రీలో వీరికి చోటు లేదు.అందుకే ఇతర మహిళలు కూడా ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో విఎస్ఎన్ మూర్తి పై నేను ఫిర్యాదు చేశాను. ఆయన మాట్లాడిన మాటలపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేసింది మంచు లక్ష్మి. మరి ఈ వ్యాఖ్యలపై జర్నలిస్టు విఎస్ఎన్ మూర్తి ఏ విధంగా క్లారిటీ ఇస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: