పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఓజి అనే పవర్ఫుల్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికి తెలిసిందే. ప్రియాంక అరుల్ మోహన్మూవీ లో హీరోయిన్గా నటించగా ... ఇమ్రాన్ హష్మీ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. అర్జున్ దాస్ ఈ మూవీ లో కీలక పాత్రలో నటించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను డి వి వి దానయ్య నిర్మించాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులను చక చకా పూర్తి చేస్తూ వస్తున్నారు. తాజాగా ఓజి మూవీ బృందం నిన్న రాత్రి ఈ సినిమాకు సంబంధించిన ఓ ఈవెంట్ను నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ కు పెద్ద ఎత్తున జనాలు విచ్చేశారు. ఈవెంట్ కి విచ్చేసిన  జనాలు ఎప్పుడు ఈవెంట్ స్టార్ట్ అవుతుందా అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూడటం మొదలు పెట్టారు. ఇక ఈవెంట్ స్టార్ట్ అయ్యే లోపే చిన్న చిన్నగా వర్షం స్టార్ట్ అయింది. ఇక ఆ తర్వాత వర్షం క్రమ క్రమంగా పెరిగింది.

దానితో ఈవెంట్ దాదాపుగా ఫెయిల్యూర్ అయింది. ఓజి ఈవెంట్ ఫెయిల్యూర్ అయినందుకు ఓ వైపు కొంత మంది జనాలు డిసప్పాయింట్ అయిన మరో విషయంలో మాత్రం పవన్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. అది ఎందుకు అనుకుంటున్నారా ..? ఓజి ఈవెంట్ వర్షం కారణంగా అనుకున్నట్లుగా జరగకపోయినా ఈ ఈవెంట్ లో భాగంగా పవన్ కళ్యాణ్ మాత్రం మాట్లాడాడు ... పవన్ కళ్యాణ్ ఈవెంట్లో అద్భుతమైన స్పీచ్ ఇచ్చాడు. దానితో పవన్ అభిమానులు మాత్రం ఫుల్ ఖుషి అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: