ప్రెసెంట్ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓజి ఫీవర్ నడుస్తుంది . సెప్టెంబర్ 25 వ తారీఖున రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రజెంట్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుందని చెప్పుకోవచ్చు . దీంతో సుజిత్ కు మంచి గుర్తింపు కూడా లభించింది . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ చిత్రం కి సుజిత్ డైరెక్షన్ వహించాడు . ఇక ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ అందుకోవడంతో ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు మూవీ టీం .


ఈ క్రమంలోనే డైరెక్టర్ సుజిత్ ఓ విషయం బయటపెట్టాడు . " పవన్ కళ్యాణ్ నాకు ఫేవరెట్ హీరో . ఆయనకి పెద్ద అభిమానిని నేను . ఆయనతో సినిమా అంటే ఒక భయం ఉండేది . ఓజీ పై మొదటి నుంచే అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి . ఏమాత్రం తేడా వచ్చినా నన్ను ఫాన్స్ వగలరు . నన్ను రోల్స్ చేస్తారని నాకు తెలుసు . ఆ భయం ఎప్పటికీ ఉండేది . అందుకే నేను ఒక ఫ్యాన్ బాయ్ గానే ఓ జి సినిమాను తీశాను . ఒక అభిమానిగా సినిమా చూస్తే పవన్ ఫ్యాన్స్ ఎలా ఊహిస్తారు నేను అలాగానే ఊహించాను .


అప్పుడు నాకు నచ్చితే కచ్చితంగా వాళ్లకు నచ్చుతుందనే నమ్మకం ఏర్పడింది . అందుకే సినిమా రిజల్ట్ ఇంత బాగా వచ్చింది " అంటూ కామెంట్స్ చేశాడు సుజిత్ . ప్రజెంట్ సుజిత్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ఏదేమైనా పవన్ ఫ్యాన్స్ కి సుజిత్ భయపడాడనే చెప్పుకోవచ్చు . ఈ భయంతోనే ఇంత బాగా సినిమా తీశాడు అని పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు . మరి ఈ సినిమా రానున్న రోజుల్లో ఇంకేంది కలెక్షన్స్ రాబట్టి ఎటువంటి రికార్డును క్రియేట్ చేస్తుందో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: