హీరో నితిన్ ప్రస్తుతం తన కెరీర్‌లో కీలకమైన దశలో ఉన్నాడు. ఇటీవల విడుదలైన ‘రాబిన్‌హుడ్’ మరియు ‘తమ్ముడు’ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాయి. ఈ వరుస పరాజయాలతో నితిన్‌కు గట్టి షాక్ తగిలింది. అందుకే ఆయన ఇప్పుడు తన తదుపరి సినిమాపై చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు.
ఈ సారి కంటెంట్ పట్ల ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.


మొదట నితిన్ వేణు యెల్దండితో ‘ఎల్లమ్మ’ అనే ప్రాజెక్ట్ చేయాలని భావించాడు. ఆ తరువాత విక్రమ్ కె. కుమార్ చెప్పిన ఒక స్పోర్ట్స్ డ్రామా చేయాల‌నుకున్నా చివరికి ఆ ప్రాజెక్టులు రెండూ నిలిచిపోయినట్లు సమాచారం. ఇదే సమయంలో ‘లిటిల్ హార్ట్స్’ దర్శకుడు సాయి మార్తాండ్ నితిన్‌కు ఓ ఎమోషనల్ లవ్ స్టోరీ వినిపించాడట. అయితే ఆ కథకు కూడా నితిన్ ఫైనల్ అవ్వలేదని తెలుస్తోంది. ప్రస్తుతం నితిన్ విఐ ఆనంద్ దర్శకత్వంలో వచ్చే కొత్త కథపై చర్చలు జరుపుతున్నాడు. వీరి కాంబినేషన్‌లో ఇప్పటికే ‘లై’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే.


మరోవైపు శ్రీను వైట్ల కూడా ఇటీవల నితిన్‌ను కలిసి ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ ఐడియా చెప్పాడని ఫిలింనగర్ టాక్. అయితే ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్‌లలో ఏదినీ నితిన్ ఫైనల్ చేయలేదు. తన కెరీర్‌లో మళ్లీ హిట్ ట్రాక్‌లోకి రావాలన్న ఉద్దేశ్యంతో నితిన్ మంచి కథ కోసం వేచి చూస్తున్నాడు. ఈ సారి ఎంచుకునే సినిమా ఆయనకు తిరుగులేని విజయాన్ని తెస్తుందా అనే ఆసక్తి సినిమా వర్గాల్లో, అభిమానుల్లో పెరుగుతోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: